భారీగా పెరిగిన యాలకుల ధర... తగ్గిన బిర్యానీ రుచి

By telugu team  |  First Published Aug 30, 2019, 1:41 PM IST

కుంకుమపువ్వు, వెనీలా తరువాత వినూత్న పరిమళంతో కొద్దిపాటి తియ్యదనంతో చిన్నచిన్న పలుకులతో ఉండి ప్రపంచాన్ని ఏలుతున్న మసాల దినుసు యాలకులు. మిఠాయిలు, బిర్యాని, ఇతర మసాలా వంటకాలలో వేయడానికి అంతా జంకుతున్నారు. ఆ పెరిగిన ధరతో యాలకులను అమ్మడానికి దుకాణ యజమానులు సైతం వెనుకంజవేస్తున్నారు. 

సుగంధ ద్రవ్యాలలో మూడో స్థానంలో ఉన్న యాలకుల ధర భారీగా పెరిగింది. సామాన్యులకు అందుబాటులో లేకుండా భారీగా పెరిగింది. ప్రస్తుతం వీటి ధరలు కిలో రూ.8000గా ఉంది. మార్కెట్లో విడిగా పది గ్రాములు రూ.100గా విక్రయిస్తున్నారు. 

కుంకుమపువ్వు, వెనీలా తరువాత వినూత్న పరిమళంతో కొద్దిపాటి తియ్యదనంతో చిన్నచిన్న పలుకులతో ఉండి ప్రపంచాన్ని ఏలుతున్న మసాల దినుసు యాలకులు. మిఠాయిలు, బిర్యాని, ఇతర మసాలా వంటకాలలో వేయడానికి అంతా జంకుతున్నారు. ఆ పెరిగిన ధరతో యాలకులను అమ్మడానికి దుకాణ యజమానులు సైతం వెనుకంజవేస్తున్నారు. 

Latest Videos

ఇలాచి ప్రియం కావడంతో కావలసినంత మోతాదులో దీనిని కలపక రుచి తగ్గిందని బిర్యానిప్రియులు వాపోతున్నారు. ఇక పేరొందిన ఆలయాల్లో ఇచ్చే ప్రసాదం లడ్డు, చెక్కరపొంగలిలలో కూడా ఇలాచి కంటికి కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. అత్యధికంగా యాలకులు పండించే కేరళ రాష్ట్రంలో ఈసారి వరదలు వచ్చి పంటలు కొట్టుకుపోవడంతో కూడా ధరలు పెరగడానికి ఒక కారణంగా వ్యాపారులు చెబుతున్నారు.

click me!