షుగర్ ఉన్నవారికి లవంగతో ఎన్ని లాభాలో..!

By Shivaleela Rajamoni  |  First Published Jul 5, 2024, 4:12 PM IST

డయాబెటిస్ ఉన్నవారు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవి తిన్నా.. అవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయా? తగ్గించుతాయో? తెలుసుకుని తినడం మంచిది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మధుమేహులకు లవంగాలు ఎంతో  ప్రయోజనకరంగా ఉంటాయి. 


ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది డయాబెటీస్ బారిన పడుతున్నారు. ఈ వ్యాధి లైఫ్ లాంగ్ ఉంటుంది. ఈ వ్యాధిని కంట్రోల్ చేయాలంటే లైఫ్ స్టైల్ ను మెరుగ్గా ఉంచుకోవడంతో పాటుగా మందులను కూడా వాడాల్సి ఉంటుంది. డయాబెటీస్ ను నియంత్రించడానికి మన వంటింట్లో ఉండే కొన్ని మసాలా దినుసులు బాగా సహాయపడతాయి. వీటిలో లవంగం ఒకటి. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడానికి లవంగాలు బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. అసలు లవంగాలు డయాబెటీస్ పేషెంట్లకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

ఈ రోజుల్లో ఒత్తిడితో కూడిన బిజీ లైఫ్ స్టైల్ వల్ల చాలా మంది వారి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. కానీ ఇది మిమ్మల్ని ఎన్నో రోగాల బారిన పడేలా చేస్తుంది. మీరు డయాబెటిస్ పేషెంట్ అయితే మీకు లవంగాలు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. 

Latest Videos

లవంగాల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. లవంగాలను తినడం వల్ల దగ్గు, జలుబు, అజీర్ణం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఇధి మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. 

లవంగాల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో మాంగనీస్, విటమిన్ కె లు కూడా ఉంటాయి. ఇవి మీ ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి. లవంగాలు యాంటీ ఆక్సిడెంట్లకు గొప్ప వనరు కూడా. అందుకే లవంగాలను యాంటీసెప్టిక్, తక్షణ నొప్పి నివారణగా కూడా ఉపయోగించొచ్చు.

డయాబెటీస్ పేషెంట్లు లవంగాలను ఎలా తినాలి?

షుగర్ పేషెంట్లు లవంగాలను ప్రతిరోజూ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. ఇందుకోసం మీరు ఒక గ్లాసు నీటిలో 8 నుంచి 10 లవంగాలను మరిగించి వడకట్టి గోరువెచ్చగా తాగొచ్చు. మూడు నెలల పాటు ఈ డ్రింక్ తాగిన తర్వాత సానుకూల ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

click me!