ఈ ఉత్తర కొరియాలో మాత్రం రూల్స్ పేరిట ఫ్యాషన్ ని తొక్కేస్తున్నారు. ఈ దేశంలో అస్సలు ధరించకూడని దుస్తులు ఏంటో ఓసారిచూద్దాం..
ప్రతి ఒక్క దేశంలో కొన్ని నియమాలు ఉంటాయి. ఈ రూల్స్ ఫాలో అవ్వాలి అంటూ ప్రభుత్వం కొన్ని నియమాలు పెడుతూ ఉంటుంది. అయితే... ఒక దేశంలో ఉన్నరూల్స వింటే ఎవరైనా షాకవ్వాల్సిందే. కనీసం అమ్మాయిలు స్కర్ట్స్ వేసుకోవడం, అబ్బాయిలు జీన్స్ వేసుకోవడం కూడా నేరమే. అది మరే దేశమో కాదు ఉత్తర కొరియా. ప్రపంచం మొత్తం ఫ్యాషన్ విషయంలో ముందుకు దూసుకుపోతుంటే.. ఈ ఉత్తర కొరియాలో మాత్రం రూల్స్ పేరిట ఫ్యాషన్ ని తొక్కేస్తున్నారు. ఈ దేశంలో అస్సలు ధరించకూడని దుస్తులు ఏంటో ఓసారిచూద్దాం..
1.స్కర్ట్స్..
దాదాపు ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అమ్మాయిలు హ్యాపీగా స్కర్ట్ ధరిస్తున్నారు. కానీ.. ఉత్తర కొరియాలో స్కర్ట్స్ వేసుకోవడం నిషేధం. స్కర్ట్ మాత్రమే కాదు.. పొట్టి దుస్తులు కూడా వేసుకోవడానికి లేదు. మోకాలి కింద వరకు ఉండే దుస్తులు మాత్రమే ధరించాలి.
2.లోగోలు ఉన్న టీషర్ట్స్..
ఈరోజుల్లో ఏ టీషర్ట్స్ చూసినా ఏదో ఒక లోగో ఉంటుంది. ముఖ్యంగా విదేశాలకు సంబంధించిన లోగోలు కూడా ఉంటున్నాయి. కానీ ఉత్తర కొరియాలో మాత్రం అలాంటి టీషర్ట్స్ ధరించడం అక్కడ నేరం. బ్రాండెడ్ దుస్తులు ఏవీ అక్కడ వేసుకోలేరు. విదేశీ బ్రాండ్స్ ఏవీ అక్కడ అమ్మరు.. ఎవరూ కొనరు కూడా. అది అక్కడ రూల్.
3.హై హీల్స్..
అంతేకాదు.. ఉత్తర కొరియాలో అమ్మాయిలు హై హీల్స్ వేసుకోవడం నిషేధం. దాదాపు అన్ని దేశాల్లో అమ్మాయిలు హై హీల్స్ ధరిస్తూనే ఉంటారు. కానీ... ఈ దేశంలో మాత్రం ఈ హై హీల్స్ ధరించడానికి వీలు లేదు. హై హీల్స్ ని అక్కడి దేశం లగ్జరీ గా భావిస్తుంది. అందుకే.. ఆ ప్రభావం ఉండకూడదని నిషేధించడం గమనార్హం.
4.మెరిసే దుస్తువులు..
చాలా మంది , ముఖ్యంగా సెలబ్రెటీలు.. మెరిసే దుస్తులు ధరిస్తూ ఉంటారు. కానీ.. ఈ ఉత్తర కొరియాలో మాత్రం.. అలాంటి దుస్తులు ధరించడం నిషేధం.ప్రకాశవంతమైన రంగులు, మెరిసే డిజైన్లను వేసుకోవడానికి వీలు లేదని అక్కడి ప్రభుత్వం చెప్పడం గమనార్హం.
5.జీన్స్..
ఈరోజుల్లో జీన్స్ వేసుకోనివారు ఎవరైనా ఉంటారా..? చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ జీన్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ... ఉత్తర కొరియాలో జీన్స్ వేసుకోవడం కూడా నిషేధమే. అది అక్కడ పెద్ద నేరం. అక్కడ ఎవరూ అలాంటి డ్రెస్ లు వేసుకోడానికి వీలు లేదు.