మారిన జీవన విధానం, వాయు, నీటి కాలుష్యం కారణంగా జట్టు సంబంధిత సమస్యలు ఎక్కువుతున్నాయి. ముఖ్యంగా చుండ్రుతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే కెమికల్స్‌తో కూడిన షాంపూలకు బదులుగా నేచురల్ టిప్స్ పాటిస్తే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అలాంటి ఓ నేచురల్ టిప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
జుట్టు సంబంధిత సమస్యలు ఇటీవల ఎక్కువుతున్నాయి. వాయు, నీటి కాలుష్యం కారణంగా ఈ సమస్యల బారిన పడుతున్నారు. కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కాకుండా పురుషులు కూడా చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో చాలా మంది చుండ్రుకు చెక్ పెట్టేందుకు షాంపూలు, నూనెలు, సెరమ్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే కెమికల్స్‌తో కూడిన వీటిని ఉపయోగించడం వల్ల సమస్య తగ్గకపోగా మరింత పెరిగే అవకాశం పెరుగుతుంది. అందుకే నేచురల్ పద్ధతుల్లో చుండ్రుకు చెక్ పెట్టొచ్చు. అరటి పండుతో చేసే హెయిర్ మాస్క్ ద్వారా జుట్టు సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందొచ్చు.
అరటి పండు హెయిర్ మాస్క్‌ను తయారు చేయడానికి ముందుగా రెండు అరటి పండ్లను తీసుకొని స్పూన్ సహాయంతో మెత్తగా చేసుకోవాలి. అనంతరం అందులో అరకప్పు పాలు లేదా పెరుగు వేసి మెత్తగా పేస్ట్‌లాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ గుజ్జులో 1 నుంచి 2 టీస్పూన్ల తేనె కలపాలి. ఇలా తయారైన హెయిర్ మాస్క్‌ను వెంట్రులకు అప్లై చేసుకోవాలి. అంతకంటే ముందు తలను శుభ్రం నీటితో కడుక్కోవాలి. నూనె, దుమ్ము వంటివి లేకుండా చూసుకోవాలి.
అనంతరం అరటి గుజ్జును జుట్టు మూలాల నుంచి అప్లై చేసుకోవాలి. ఇలా 50 నిమిషాలు పాటు ఉంచుకున్న తర్వాత గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే చుండ్రు సమస్య మళ్లీ తిరిగిరాదు. పాలలోని లాక్టిక్ యాసిడ్ తలలో దురదను తగ్గిస్తుంది. అలాగే తేనెలో ఉండే క్లెన్సింగ్ గుణాలు నెత్తిని హైడ్రేట్‌గా ఉంచడానికి సహాయపడతాయి.
అరటి పండుతో చేసిన హెయిర్ మాస్క్‌తో జుట్టు సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దెబ్బతిన్న వెంట్రుకలు మొదలు, చుండ్రు తగ్గుతుంది. అరటిపండ్లలో ఉండే జింక్, మెగ్నీషియం వెంట్రుకలను బలోపేతం చేస్తాయి. ఇక అరటిలో ఉండే సహజ న్యూట్రియంట్లు జుట్టును ఆరోగ్యంగా, రీఫ్రెష్‌గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ హెయిర్ మాస్క్ ద్వారా జుట్టు దృఢంగా మారడంతో పాటు వెంట్రుకలు సాఫ్ట్‌గా అవుతాయి. ఇది జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అరటిపండులో హైడ్రేటింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. తలపై ఉండే చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది. దీంతో చుండ్రు సమస్య దూరమవ్వడమే కాకుండా, కుదుళ్లను కూడా ఆరోగ్యంగా తయారు చేస్తుంది.
అరటి పండులో ఉండే పోటాషియం, విటమిన్ బీ6 వంటి పోషకాలు జుట్టు జుట్టు పటుత్వాన్ని పెంచుతాయి. దీంతో జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడొచ్చు. అరటి పండులోని విటమిన్ A, విటమిన్ Cలు రక్తప్రసరణను మెరుగుపరచి జుట్టు పెరుగుదలకు కారణమవుతాయి. వెంట్రుకలు త్వరగా పెరగడానికి ఇది దోహదపడుతుంది.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.