పిల్లల ఆయురారోగ్యాల కోసం ఉపవాసం ఉండే అహోయి అష్టమి వ్రతం ఎప్పుడంటే..?

By Mahesh Rajamoni  |  First Published Oct 10, 2022, 12:45 PM IST

తమ పిల్లల ఆనందం, దీర్ఘాయుష్షు కోసం.. అహోయి అష్టమి నాడు ప్రతి తల్లీ ఉపవాసం ఉంటుంది. మరి ఈ అహోయ్ అష్టమి ఎప్పుడు.. దీనివెనకున్న కథ ఏంటో తెలుసుకుందాం పదండి.. 
 


మన దేశంలో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంటుంది. భారతదేశంలోని ప్రధాన పండుగల్లో అహోయి అష్టమి ఒకటి. ప్రతి ఏడాది కార్తీక మాసంలోని  కృష్ణపక్షంలోని అష్టమి తిథి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజు తమ పిల్లల కోసం తల్లులు ఉపవాసం ఉంటారు. ఇక ఈ ఏడాది అహోయి అష్టమి అక్టోబర్ 17 వచ్చింది.  అహోయి అష్టమి కర్వా చౌత్ తర్వాత వస్తుంది. మరి ఈ అహోయి అష్టమి ఉపవాసం వెనకున్న అసలు కథ ఏంటో తెలుసుకుందాం పదండి.. 

అహోయి అష్టమి నాడు ఉపవాసం ఎందుకు ఉంటారు? 

Latest Videos

undefined

అహోయి అష్టమి నాడు తల్లులు రోజంతా నిష్టగా ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసాన్ని ప్రత్యేకించి తమ పిల్లల శ్రేయస్సు, ఆనందం కోసమే ఉంటారు. ఈ ఉపవాసం ద్వారా తమ పిల్లలు నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారని నమ్ముతారు. 

అహోయి అష్టమి కథ

ఒక గ్రామంలో.. ఒక వడ్డీ వ్యాపారికి ఏడుగురు కొడుకులు ఉండేవారు. ఒకరోజు ఈ వ్యాపారీ భార్య ఇంటి గోడలను కట్టడానికి మట్టిని తీసుకురావడానికి వెళుతుంది. అయితే మట్టిని పారతో తొవ్వుతుండగా.. పొరపాటున ఆ పార ఓ చిన్నారిపై పడుతుంది. దీంతో ఆ చిన్నారి అక్కడిక్కడే చనిపోతుంది. నా చేతులతో నేనే చంపానని ఆ వడ్డీ వ్యాపారి భార్య ఎంతో ఏడుస్తుంది. బాధపడుతూనే ఆమె ఇంటికి వస్తుంది. అయితే కొంతకాలం తర్వాత ఆమె ఏడుగురు కొడుకుల్లో ఒకరు జబ్బు బారిన పడి కొన్ని రోజులకే చనిపోతాడు. ఆ తర్వాత ఒక్కొక్కరు ఆరుగురు కొడుకులు కూడా అలాగే చనిపోతారు. నేను చేసిన ఆపాపం వల్లే నా కొడుకులు ఇలా చనిపోయారని ఆ తల్లి రోధిస్తుంది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ఆడవారు నీ పశ్చాతాపం వల్ల నీ పాపాలు సగం పోయాయి. ఇప్పుడు నువ్వు అష్టమి నాడు ఉపవాసం ఉండి అహోయి మాతను పూజించమని చెప్తారు. ఆమె అలాగే అహోయి అష్టమి నాడు ఉపవాసం ఉండి.. దేవతను పూజిస్తుంది. ఈ పూజను మెచ్చిన అహోయి దేవత మళ్లీ తన కొడుకులను తిరిగి బతతికిస్తుంది. అందుకే ప్రతి ఏడాది పిల్లల సుఖ సంతోషాలు, ఆనందం, దీర్ఘాయుష్షు కోసం ఈ రోజున ఉపవాసం ఉంటారు. 
 

click me!