ఈ చీర కడితే.. ఎవ్వరైనా మీ వైపు తిరిగి చూడాల్సిందే!

Published : Jan 25, 2025, 04:37 PM IST
ఈ చీర కడితే.. ఎవ్వరైనా మీ వైపు తిరిగి చూడాల్సిందే!

సారాంశం

చీరలు మహిళల అందాన్ని రెట్టింపు చేస్తాయి. అందుకే ఆడవాళ్లు ఎన్ని చీరులున్నా ఇంకా ఇంకా కొంటూనే ఉంటారు. మార్కెట్ లోకి కొత్త మోడల్ వస్తే చాలు. వెంటనే కొనేస్తుంటారు. అలా మీ అందానికి మరింత వన్నె తెచ్చే కొన్ని ప్రత్యేకమైన చీరలను ఇప్పుడు చూద్దాం.

ఎంతమందిలో ఉన్న తాము స్పెషల్ గా కనబడాలని కోరుకుంటారు మహిళలు. అందుకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. హేయిర్ స్టైల్ నుంచి మొదలుపెడితే.. కాలికి వేసుకునే చెప్పుల వరకు అన్నీ ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. ఇక చీరల సంగతి అయితే చెప్పనవసరం లేదు. రాయల్, ఎలిగెంట్ లుక్ కోసం ఎప్పుడూ మహిళలు కొత్త డిజైన్ చీరలకోసం వెతుకుతూనే ఉంటారు. అలాంటి వారికి ఈ 5 రకాల సిల్క్ చీరలు మరింత అందాన్నిస్తాయి.

కాంచీపురం సిల్క్ చీర
భారీ బార్డర్, హెవీ పల్లూ, బంగారు జరీ వర్క్‌తో వచ్చే కాంచీపురం సిల్క్ చీరలు మహిళల ఉత్తమ ఎంపిక. పెళ్లిళ్లు, గ్రాండ్ ఈవెంట్‌లకు ఇవి సరైన ఎంపిక. రాయల్ లుక్ కోసం ఎరుపు, ఊదా, బంగారు వంటి ప్రకాశవంతమైన రంగులను ఎంచుకోవాలి.

బనారస్ సిల్క్ చీర
బంగారు, వెండి జరీ వర్క్‌తో బనారస్ సిల్క్ చీరను ఎంచుకోవచ్చు. ఈ చీరలు పండుగలు, రిసెప్షన్‌లకు సరైనవి. రాయల్ లుక్ కోసం ఎరుపు, మెరూన్, ఆకుపచ్చ షేడ్స్ చీరలను ఎంచుకోండి. 

పట్టోలా సిల్క్ చీర
డబుల్ ఇక్కత్ నేతతో పట్టోలా సిల్క్ చీరలు చాలా అందంగా కనిపిస్తాయి. ఇందులో జ్యామితీయ, పక్షుల వంటి డిజైన్‌లు ఎక్కువగా ఉంటాయి. సాంప్రదాయ కార్యక్రమాల కోసం మల్టీకలర్, ఎరుపు షేడ్స్‌లో చీరలను ఎంచుకోవచ్చు. 

బాలుచారి సిల్క్ చీర
పల్లూపై పురాణ గాథల డిజైన్‌లతో బాలుచారి సిల్క్ చీర అద్భుతంగా ఉంటుంది. భారీ బార్డర్, కళాత్మక డిజైన్‌లతో ఉన్న ఈ చీరను సాంస్కృతిక కార్యక్రమాలకు ఎంచుకోవచ్చు. 

చందేరి సిల్క్ చీర
పువ్వులు, బూటీ ప్రింట్‌లతో చందేరి సిల్క్ చీరలు అందంగా ఉంటాయి. వీటి ఫాబ్రిక్ తేలికగా, ఫినిషింగ్ మెరిసేలా ఉంటుంది. వేసవి పెళ్లిళ్లు, పగటిపూట ఈవెంట్‌లకు ఇవి సరైన ఎంపిక. రాయల్ లుక్ కోసం పాస్టెల్, లేత బంగారు షేడ్స్‌ను ఎంచుకోవాలి.

PREV
click me!

Recommended Stories

తక్కువ ధరకే వజ్రాల చెవిపోగులు, చూసేయండి
ఈ నెలలో మనదేశంలో మంచు కురిసే ప్రాంతాలు ఇవే