మీ ఇంట్లో బొద్దింకలు వున్నాయా..? వాటిని తరిమికొట్టే 5 చిట్కాలివే...

By Arun Kumar P  |  First Published Jul 11, 2024, 10:26 PM IST

బొద్దింకలు... సాధారణంగా గ‌ృహిణులకు చిర్రెత్తించే జీవులు. మీ ఇంట్లోనూ బొద్దింకలు స్వైరవిహారం చేస్తున్నాయా... అయితే మీరు చేయాల్సిందిదే.... 


వర్షాకాలం వచ్చిందంటే ఎక్కడలేని జబ్బులు చుట్టుముడతాయి. ముఖ్యంగా వాతావరణంలో మార్పుల కారణంగా మనకు తెలియకుండానే ఇంట్లోకి వ్యాధులను వ్యాపింపజేసే జీవులు ఎంటరవుతాయి. ఇలాంటి వాటిలో  బొద్దింకలు ప్రధానమైనవి... మనం తినే ఆహారాన్ని కలుషితం చేసే జీవుల్లో బొద్దింకలు ముందుటాయి. ఇంట్లో బొద్దింకలు వున్నాయంటే మన ఆరోగ్యం రిస్క్ లో వున్నట్లే.  

ఇంట్లో బొద్దింకలకు ఆవాసం వంటిగది. గ్యాస్ సిలిండర్, సింక్, చెత్త పోగయ్యే చోట ఇవి కనిపిస్తుంటాయి. మనం కొద్దిగా ఏమరపాటుగా వున్నామా అంతే సంగతి... తినే ఆహార పదార్థాలపై వాలిపోతాయి బొద్దింకలు... ఇది చూడటానికే జుగుప్సాకరంగా వుంటుంది. ఇక ఈ బొద్దింకలు వాలిన ఆహారాన్ని తిన్నామో ఇంటిల్లిపాది రోగాలబారిన పడటం ఖాయం.  అందువల్లే వర్షాకాలంలో బొద్దింకలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్తపడాలి... ఒకవేళ ఇప్పటికే ఇంట్లోకి వచ్చివుంటే తరమికొట్టాలి. ఇలా బొద్దింకల నిర్మూలనకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Latest Videos

undefined

బొద్దింకలను ఇంట్లోంచి తరిమే 5 చిట్కాలు : 

1. బొద్దింకలు ఎక్కువగా తేమ ప్రాంతాల్లో జీవిస్తుంటాయి. కాబట్టి ఇంటి  చుట్టుపక్కల వర్షపునీరు నిలబడకుండా చూసుకోవాలి. అలాగే ఇంట్లో మరీముఖ్యంగా వంటగదిలో   తేమ లేకుండా చూసుకోవాలి. 

2. ముఖ్యంగా వంటగదిలోని సింక్ వద్ద బొద్దింకలు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి సింక్ పరిశుభ్రంగా వుంచుకోవడం ద్వారా బొద్దింకలను తరిమి కొట్టవచ్చు. వంట వస్తువులు కడిగిన తర్వాత సింక్ లో ఎలాంటి పదార్థాలు లేకుండా తీసేయాలి. సింక్ లోంచి నీరు బయటకు వెళ్ళే పైప్ లో కూడా ఆహార పదార్థాలు తట్టుకుని వుంటాయి. కాబట్టి ఆ పైప్ ను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. 
 
3. ఇంట్లో చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలి. వంటగదిలో కూరగాయలు తరిగిన తర్వాత మిగిలినవాటిని ఎక్కడపడితే అక్కడ వేయకూడదు.  చెత్త వుండే ప్రాంతాలనే బొద్దింకలు అవాసంగా మార్చుకుంటాయి. 

4. ఎప్పటికప్పుడు ఉపయోగించిన వంట సామాగ్రిని శుభ్రంగా కడుక్కోవాలి. తిన్నవెంటనే మిగిలిపోయిన ఆహార పదార్థాలను బయట పడేయాలి. రాత్రి సమయంలో చెత్త డబ్బాలను ఇంట్లో పెట్టుకోకుండా బయట పెట్టాలి. కిటికీలు, తలుపుల తెరిచివుంచడంతో బొద్దింకలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి...కాబట్టి వాటిని మూసివుంచాలి. 

5. అట్టపెట్టెలు బొద్దింకలకు మంచి ఆహారం. చెక్క గుజ్జుతో తయారుచేసే ఇలాంటి అట్టపెట్టెలు ఇంట్లో లేకుండా చూసుకోవాలి. 

ఇక బొద్దింకల నిర్మూలనకు అనేక  రకాల మందులు మార్కెట్ లో అందుబాటులో వున్నాయి. వాటిని ఉపయోగించడం ద్వారా కూడా బొద్దింకలను ఇంట్లోంచి తరిమికొట్టవచ్చు. 
 

click me!