సెక్స్ కి కొన్ని గంటల ముందు దీనిని తీసుకుంటే ప్రయోజనం బాగా కనపడుతుంది అంటున్నారు.
సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి చాలా మంది రకరకాల మందులు, వయగ్రా లాంటివి తీసుకుంటూ ఉంటారు. అయితే..వాటి కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. మరి సామర్థ్యం పెంచుకోవడానికి ఎలాంటి ఉత్ప్రేరకాలు వాడుకోవాలి అని అనుకుంటున్నారు. కొన్ని రకాల ఫుడ్స్ కనుక సెక్స్ కి ముందు తీసుకుంటే.. మీలో సామర్థ్యం పెరుగుతుందంటున్నారు నిపుణులు. ఆ ఫుడ్స్ ఎంటో ఒకసారి మనమూ చూసేద్దామా..
1. తేనె.. తేనెలో బోరాన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ రెగ్యులేట్ చేయడానికి దోహదపడుతుంది. తద్వారా సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. తేనెని ఏదైనా ఫుడ్ లో కలిపి తీసుకున్నా ప్రయోజనం ఉంటుంది.
2.పుచ్చకాయ.. పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు తెలిసిన విషయమే. అంతేకాదు.. ఇందులో అమైనో యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి సెక్స్ సామర్థ్యాన్ని త్వరగా పెంచడానికి ఉపయోగపడతాయంటున్నారు పరిశోధకులు
3.దానిమ్మ.. దానిమ్మ కాయను ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇవి తీసుకోవడం వల్ల శరీరంలో నైట్రిక్ యాసిడ్స్ శాతం పెరుగుతుంది.
4. పైనాపిల్.. పైనాపిల్ ముక్కలు కానీ, జ్యూస్ కానీ తీసుకున్నా సెక్సువల్ ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. సెక్స్ కి కొన్ని గంటల ముందు దీనిని తీసుకుంటే ప్రయోజనం బాగా కనపడుతుంది అంటున్నారు.
ఈ నాలుగు రకాల ఫుడ్స్.. సెక్స్ విషయంలో సహజ ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయని..పలు రకాల పరిశోధనల్లో ఇది రుజువైందని వారు చెబుతున్నారు.