PNB SO Recruitment 2022: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు చేసుకోండిలా..!

By team telugu  |  First Published Apr 22, 2022, 3:56 PM IST

Punjab National Bank: భారత ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ పలు ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్‌ రాతప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
 


పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. PNB స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO), మేనేజర్ (రిస్క్), మేనేజర్ (క్రెడిట్) , సీనియర్ మేనేజర్ (ట్రెజరీ) విభాగాల్లో 145 కంటే ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు PNB అధికారిక వెబ్‌సైట్ pnbindia.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 22 నుండి ప్రారంభమవుతుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే 07. ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించి.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులు తుది ఎంపిక చేస్తారు.

అర్హత

Latest Videos

undefined

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుండి చార్టర్డ్ అకౌంటెంట్ (CA), కాస్ట్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ (CMA), చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ (CFA), CFA అర్హతను కలిగి ఉండాలి, లేదా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 60% మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి, అభ్యర్థి కనీస వయస్సు 25 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు ఉండాలి.

PNB రిక్రూట్‌మెంట్ 2022.. ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ - ఏప్రిల్ 22, 2022

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ - 07 మే 2022

పరీక్ష తాత్కాలిక తేదీ - జూన్ 12, 2022

రిక్రూట్‌మెంట్ వివరాలు

పోస్ట్ పేరు : మేనేజర్ (రిస్క్)

పోస్టుల సంఖ్య : 40

పే స్కేల్ : రూ. 48,170 - రూ. 49,910

పోస్ట్ పేరు : మేనేజర్ (క్రెడిట్)

పోస్టుల సంఖ్య : 100

పే స్కేల్ : రూ. 48,170 - 49,910

పోస్టు పేరు : సీనియర్ మేనేజర్ (టి.ఆర్. మేనేజర్ )

పోస్టుల సంఖ్య : 05

పే స్కేల్ :  రూ. 63,840 - 73,790

కేటగిరీ వారీగా పోస్టుల సంఖ్య

మొత్తం పోస్ట్‌లు - 145

- జనరల్ - 59

- ఓబీసీ - 38

- ఎస్సీ - 22

- EWS - 14

- ఎస్టీ- 12

- దరఖాస్తు రుసుము: పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ST, SC ,PWBD కేటగిరీ అభ్యర్థులు 50 రూపాయల దరఖాస్తు రుసుమును చెల్లించాలి. ఇతర కేటగిరీ అభ్యర్థులు రూ. 850 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

- ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాతప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

click me!