NIT Recruitment:ఎన్‌ఐ‌టి వరంగల్‌లో ప్రొఫెసర్ పోస్టుల ఉద్యోగాలు, అప్లికేషన్ ప్రక్రియ ఏంటో తెలుసుకోండి

By asianet news teluguFirst Published Mar 12, 2022, 11:23 AM IST
Highlights

ఎన్‌ఐ‌టి వరంగల్ రిక్రూట్‌మెంట్  ద్వారా ఎంపికైన అభ్యర్థులను సంస్థలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2 పోస్టులలో నియమిస్తారు.

విద్యారంగంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కంటున్న అభ్యర్థులకు శుభవార్త. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వరంగల్‌లోని వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో చేరడానికి ఇష్టపడే అభ్యర్థులు NIT వరంగల్ అధికారిక వెబ్‌సైట్ nitw.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

చివరి తేదీలోగా దరఖాస్తు చేసుకోండి
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), వరంగల్ ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 17 మార్చి 2022లోగా తమ దరఖాస్తును చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య కారణంగా, అభ్యర్థులు చివరి నిమిషంలో సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి మీ దరఖాస్తును వీలైనంత త్వరగా పూర్తి చేయండి. 

NIT వరంగల్ రిక్రూట్‌మెంట్ ద్వారా 99 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు సంస్థలోని వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2 పోస్టులపై నియమిస్తారు. రిక్రూట్‌మెంట్‌లో మొత్తం ఖాళీల సంఖ్య 99. మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు ఇన్‌స్టిట్యూట్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్‌ను చెక్ చేయవచ్చు. 

రిక్రూట్‌మెంట్ వివరాలు
ప్రొఫెసర్ పోస్టుల ఖాళీల సంఖ్య - 29
అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీల సంఖ్య - 50
అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1  ఖాళీల సంఖ్య – 12
అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2 ఖాళీల సంఖ్య - 8 

ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫీజు
NIT వరంగల్ విడుదల చేసిన రిక్రూట్‌మెంట్ పోస్టుల కోసం  అభ్యర్థులు అర్హతల  కోసం  అధికారిక నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని చదవవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే జనరల్, OBC, EWS కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల అభ్యర్థులు రూ.500 దరఖాస్తు  చెల్లించాల్సి ఉంటుంది.

 ఎలా దరఖాస్తు చేయాలి?
క్రింద ఇచ్చిన సులభమైన మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 
ముందుగా అభ్యర్థులు సంస్థ  అధికారిక వెబ్‌సైట్, nitw.ac.inని సందర్శించండి.
హోమ్ పేజీలో కనిపించే సంబంధిత రిక్రూట్‌మెంట్‌ లింక్‌పై క్లిక్ చేయండి.
మీరు  రిజిస్టర్ చేసుకోని లాగిన్ చేసి దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. 
దరఖాస్తు రుసుము చెల్లించి ఫార్మ్ సబ్మిట్ చేయండి
దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాక  తదుపరి అవసరాల కోసం దాని ప్రింట్ అవుట్‌ను పొందండి. 

click me!