భారతీయ రైల్వేలో ఉద్యోగాలు కోరుకునే యువతకి ఇది శుభవార్తే అని చెప్పాలి.. ఈస్ట్రన్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
భారతీయ రైల్వేలో ఉద్యోగాలు కోరుకునే యువతకి ఇది శుభవార్తే అని చెప్పాలి.. ఈస్ట్రన్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,972 పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు rrcer.comలోని RRCER అధికారిక సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 11న ప్రారంభించబడుతుంది.. మే 10, 2022న ముగుస్తుంది. దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లోనే సమర్పించాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 2972
undefined
హౌరా డివిజన్ – 659 పోస్టులు
లిలుహ్ డివిజన్ – 612 పోస్టులు
సీల్దా డివిజన్ – 297 పోస్టులు
కంచరపర డివిజన్ – 187 పోస్టులు
మాల్డా డివిజన్ – 138 పోస్టులు
అసన్సోల్ డివిజన్ – 412 పోస్టులు
జమాల్‌పూర్ డివిజన్ – 667 పోస్టులు
ముఖ్య సమాచారం
అర్హత: ఈ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి మొత్తంగా కనీసం 50 శాతం మార్కులతో సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అదనంగా NCVT/SCVT జారీ చేసిన నిర్దేశిత ట్రేడ్‌లో జాతీయ TED సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాతే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. అయితే, SC/ST/PWBD/మహిళా అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.