ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య యుద్దం కొనసాగుతున్న వేళ మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా సోషల్ మీడియాలో చేసిన పోస్టు దుమారం రేపిన సంగతి తెలిసిందే.
ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య యుద్దం కొనసాగుతున్న వేళ మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా సోషల్ మీడియాలో చేసిన పోస్టు దుమారం రేపిన సంగతి తెలిసిందే. పాలస్తీనాకు మద్దతుగా మియా ఖలీఫా చేసిన ట్వీట్‌పై పెద్ద సంఖ్యలో నెటిజన్లు మండిపడుతున్నారు. తాజా ఆ ట్వీట్ ఆమెను కూడా ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆమె ఒక పోడ్‌కాస్ట్ ఒప్పందాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కెనడియన్ రేడియో హోస్ట్, పోడ్‌కాస్టర్ అయిన టాడ్ షాపిరోతో పోడ్‌కాస్ట్ ఒప్పందం నుంచి మియా ఖలీఫా తొలగించబడింది. ఈ విషయాన్ని టాడ్ షాపిరో స్వయంగా ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు.
అసలేం జరిగిందంటే..
ఇజ్రాయెల్, హమాస్ యుద్దంపై స్పందిస్తూ.. ‘‘పరిస్థితిని చూసేటప్పుడు మీరు పాలస్తీనియన్ల పక్షం వహించలేకపోతే.. మీరు వర్ణవివక్ష అనే తప్పు వైపున ఉన్నారని అర్థం. చరిత్ర దీనిని కాలక్రమేణా రుజువు చేస్తుంది’’ అని మియాఖలీఫా పేర్కొన్నారు. అలాగే అంతకుముందు పాలస్తీనా స్వాతంత్ర్య సమరయోధులు అని ఓ ట్వీట్‌లో ప్రస్తావించారు.
undefined
ఈ పరిణామాలపై స్పందించిన టాడ్ షాపిరో.. ‘‘మియా ఖలీఫా.. ఇది చాలా భయంకరమైన ట్వీట్. మీరు వెంటనే తొలగించబడినట్లు భావించండి. ఇది అసహ్యకరమైనది. అంతేకాకుండా అసహ్యనికి మించినది. దయచేసి మంచి మనిషిగా మారండి. మీరు మరణం, అత్యాచారం, కొట్టడం, బందీలుగా తీసుకోవడానికి క్షమించడం కనిపిస్తుంది. మీ అజ్ఞానాన్ని ఏ పదాలు వివరించలేవు. ముఖ్యంగా విషాదం ఎదురైనప్పుడు మనుషులు కలిసి రావాలి. మీరు మంచి వ్యక్తిగా మారాలని నేను ప్రార్థిస్తున్నాను. అయితే ఇప్పటికే చాలా ఆలస్యం అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు.
This is such a horrendous tweet . Consider yourself fired effective immediately. Simply disgusting. Beyond disgusting. Please evolve and become a better human being. The fact you are condoning death, rape, beatings and hostage taking is truly gross. No words can… https://t.co/ez4BEtNzj4
— Todd Shapiro (@iamToddyTickles)అయితే తన పోస్టుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మియా ఖలీఫా వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. తన ప్రకటన ఏ విధంగానూ హింసను ప్రేరేపించలేదని అన్నారు. పాలస్తీనా పౌరులను వర్ణించడానికి ‘‘స్వాతంత్ర్య సమరయోధులు’’ అనే పదాన్ని ఉపయోగించడాన్ని ఆమె సమర్థించారు. అది వారి పోరాటానికి ఖచ్చితంగా ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొన్నారు. పాలస్తీనా పౌరులు ప్రతిరోజూ స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారని అన్నారు.
I’d say supporting Palestine has lost me business opportunities, but I’m more angry at myself for not checking whether or not I was entering into business with Zionists. My bad. https://t.co/sgx8kzAHnL
— Mia K. (@miakhalifa)పాలస్తీనాకు తన మద్దతు తన వ్యాపార అవకాశాలను కోల్పోయేలా చేసిందని మియా ఖలీఫా పేర్కొన్నారు. అయితే జియోనిస్ట్‌లతో వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నానా లేదా అనేది చూసుకోనందుకు తనపై తనుకు కోపం వచ్చిందని కూడా తెలిపారు.