డ్రగ్స్ మాఫియాతో ఘర్షణ.. 166 మంది జనాన్ని చంపి పాతిపెట్టిన కిరాతకులు

By sivanagaprasad KodatiFirst Published 7, Sep 2018, 12:07 PM IST
Highlights

తమ అకృత్యాలకు, అక్రమ దందాకు అడ్డొచ్చిన ఎంతమందిని అయినా చంపి వేయడం మనం ఎన్నో సినిమాల్లో చూసి ఉంటాం. అచ్చం అలాంటి సంఘటనే నిజ జీవితంలో జరిగింది

తమ అకృత్యాలకు, అక్రమ దందాకు అడ్డొచ్చిన ఎంతమందిని అయినా చంపి వేయడం మనం ఎన్నో సినిమాల్లో చూసి ఉంటాం. అచ్చం అలాంటి సంఘటనే నిజ జీవితంలో జరిగింది. తూర్పు మెక్సికోలోని వెరక్రూజ్ ప్రాంతంలో 166 మంది పౌరుల మృతదేహాలను పోలీసులు గుర్తించడం దేశంలో సంచలనం సృష్టించింది.

వీరంతా ఎవరు..? ఇంతమందిని ఎవరు చంపి ఉంటారు..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రాంతంలలో విచ్చలవిడిగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న మాఫియాతో ఇక్కడి ప్రజలు పోరాడుతున్నారు. ఆ ముఠాతో జరిగిన ఘర్షణల్లో 166 మందిని చంపి, పాతిపెట్టి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

ఆగస్టు 8న తవ్వకాలు ప్రారంభించిన పోలీసులకు 166 పుర్రెలు, 200 దుస్తులు, 144 ఐడీ కార్డులు లభించాయి. ఫోరెన్సిక్  నివేదిక ప్రకారం రెండేళ్ల  క్రితం వారిని చంపి ఉంటారని తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రాంతం ఎక్కడుందో మెక్సికో ప్రభుత్వం ప్రకటించలేదు.

Last Updated 9, Sep 2018, 11:26 AM IST