స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం : ఎవరీ శృతి? డాక్టర్ కావాలనుకుని ఈ కూపంలోకి ఎలా వచ్చింది?...

First Published | Jun 28, 2023, 9:15 AM IST

స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా కేసులో ‘శృతి’ అనే పేరు ప్రముఖంగా వినిపించింది. ఇంతకీ ఎవరీమె? అంతకుముందు కూడా ఇలాంటి కేసులో పట్టుబడిందా? 

హైదరాబాద్ : హైదరాబాద్ లో కలకలం రేపిన స్పా సెంటర్ ముసుగుల వ్యభిచారం కేసులో శృతి పేరు ప్రముఖంగా వినిపించింది. ఇంతకీ ఈ శృతి ఎవరు? అనేది అందరికీ చర్చనీయాంశం అయ్యింది. ఆమె ఓ మధ్యతరగతి యువతి. డాక్టర్ కావాలన్న కోరిక.. పేదరికంతో తీరలేదు.. ఆ తరువాత ఎయిర్ హోస్టెస్ కావాలనుకుంది.. కానీ అదీ తీరలేదు. దీంతో ఈజీమనీ కోసం వ్యభిచారదందాలోకి దిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే... 

హైదరాబాదులో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న స్పా మీద నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ముగ్గురు నిర్వాహకులు, పదిమంది యువతులు, 18 మంది విటులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరిని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. 

Latest Videos


బంజార హిల్స్ రోడ్ నెంబర్ 10 లోని క్వారీ ఎదురుగా ఉన్న ఓ అపార్ట్మెంట్లో గుట్టుగా ఈ వ్యభిచారం జరుగుతుంది. అక్కడ ఉన్న పర్పుల్ నేచురల్ హెల్త్ త్రూ  ఆయుర్వేద స్పా, మసాజ్ సెంటర్ దీనికి అడ్డాగా మారింది. 

రాయల శృతి, రమణ, జాహెద్ ఉల్ హక్ లు కలిసి.. ఆ సెంటర్ ఏర్పాటు చేశారు ఈ స్పా సెంటర్ కు వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి.. క్రాస్ మసాజ్, వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఆదివారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. 

ఈ స్పా సెంటర్ నిర్వాహకులైన శృతి, రమణ, జాహీద్ ఉల్ హక్ లను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసును నమోదు చేసి సోమవారం రిమాండ్ కు తరలించారు. యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. 18 మంది విటులను కోర్టులో హాజరు పరిచారు. 

అయితే, ఈ కేసులో శృతి గురించి షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన శృతి చదువుల్లో చురుకుగా ఉండేది. చిన్నతనం నుంచి డాక్టర్ కావాలనుకుని పట్టుదలగా చదివింది. ఉక్రెయిన్ లో మెడిసిన్ సీటు సంపాదించింది. ఫస్ట్ ఇయర్ అక్కడే పూర్తి చేసింది. కానీ, ఆర్థిక ఇబ్బందులు ఆమె చదువును ముందుకు సాగనివ్వలేదు. సెకండ్ ఇయర్ కు వచ్చేసరికి ఫీజులు చెల్లించలేకపోయింది. దీంతో అక్కడ ఉండలేక స్వస్థలమైన భద్రాచలం తిరిగి వచ్చేసింది. 

ఆ తర్వాత హైదరాబాద్ అమీర్పేట్ లోని ఓ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఎయిర్ పోస్ట్స్ గా ట్రైన్ అయింది. ఆ సమయంలో డబ్బుల కోసం బంజారాహిల్స్ లోని ఓ స్టార్ హోటల్లో  రిసెప్షనిస్ట్ గా పనిలో చేరింది. అక్కడే ఆమె జీవితం మలుపు తిరిగింది. ఆ సమయంలో అక్కడి తళుకు బెలుకులు ఆమెను ఆకర్షించాయి. పనిచేస్తున్న సమయంలోనే స్టార్ హోటల్ లైఫ్, ఆ లగ్జరీకి అలవాటు పడింది. ఎలాగైనా బాగా డబ్బులు సంపాదించాలనుకుంది. 

డాక్టర్ కావాలనుకున్న కోరిక ఆదిలోనే అంతమయ్యింది. ఆ తర్వాత ఎయిర్ పోస్టర్స్ కావాలనుకున్నా..  అది సాకారం అయ్యేలా కనిపించకపోవడంతో.. తేలికగా డబ్బు సంపాదించే మరో మార్గాన్ని ఎన్నుకుంది.  దీంట్లో భాగంగానే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మసాజ్ సెంటర్ తెరిచింది. అక్కడికి తన పరిచయాలతో వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తెప్పించింది. వారితో వ్యభిచారం నిర్వహిస్తూ ఈజీ మనీకి అలవాటు పడింది. అయితే, పంజాగుట్ట పోలీసులు కొద్ది రోజుల్లోనే ఈ విషయాన్ని గుర్తించి.. ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

ఆ తర్వాత కొంత కాలానికి జైలు నుంచి వచ్చిన శృతి అప్పటికే తనకు స్పా సెంటర్ నిర్వహణలో మెలకువలు తెలియడంతో మళ్లీ అదే దారి పట్టింది. ఈసారి పంజాగుట్ట నుంచి తన మకాన్ని బంజారాహిల్స్ కు మార్చింది. ఆమె మసాజ్ సెంటర్ కొద్ది రోజుల్లోనే వృద్ధి చెందింది. ఆమె వ్యాపారం మూడు పూలు, ఆరుకాయలుగా సాగుతున్న క్రమంలో మరోసారి పోలీసులకు స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం అందింది. దీంతో ఆ సెంటర్ మీద దాడులు నిర్వహించారు. ఈసారి ఆమె బంజారాహిల్స్ పోలీసులకు పట్టుబడింది. తాజాగా సోమవారం జైలుకు వెళ్ళింది.
 

click me!