మరో 20 సంవత్సరాలలో.. రాత్రిపూట అవి కనిపించవు.. ! కారణం ఇదే..

First Published | May 29, 2023, 6:36 PM IST

న్యూఢిల్లీ : పెరుగుతున్న కాంతి కాలుష్యం కారణంగా ఆకాశంలోని నక్షత్రాలు రానున్న 20 ఏళ్లలో కనిపించకుండా పోనున్నాయి. ఈ  కాంతి కాలుష్యం కారణంగా వాటిని చూడలేకపోతున్నామని శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే, రాత్రిపూట భూమిపై ఉపయోగించే చాలా ప్రకాశవంతమైన లైట్లు, లేదా లైట్లు వెలిగించడం  సాధారణంగా రాత్రిని కాంతితో నింపుతుంది. అందువల్ల పగటిపూట నక్షత్రాలను ఎలా చూడలేమో రాత్రిపూట కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

దీని గురించి ఒక ఇంటర్వ్యూలో బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త రాయల్ మార్టిన్ రీస్ మాట్లాడుతూ 'గత కొన్నేళ్లుగా కాంతి కాలుష్యం తీవ్రంగా మారింది. 2016 నాటికి ఖగోళ శాస్త్రవేత్తలు పాలపుంత (Milky Way Galaxy) ప్రపంచంలోని మూడింట ఒక వంతు మందికి కనిపించదని నివేదించారు. అప్పటి నుండి కాంతి కాలుష్యం గణనీయంగా దిగజారింది. ప్రస్తుత రేటు ప్రకారం, చాలా ప్రముఖ నక్షత్రరాశులు రానున్న 20 సంవత్సరాలలో కనిపించలేని  లేదా చూడలేనిగా ఉంటాయని అంచనా వేయబడింది. 

తరవాత తరం పిల్లలు రాత్రిపూట ఆకాశాన్ని, దాని  నుండి వచ్చే  ప్రకాశాన్ని  నక్షత్రాలతో చూడలేరన్నది తీవ్రమైన సమస్య. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఈ కాంతి కాలుష్యం తక్కువగా  కనిపిస్తుంది.


లైట్-ఎమిటింగ్ డయోడ్‌లు (LED), ఇతర రకాల లైటింగ్‌ల వాడకం ఇప్పుడు రాత్రిపూట ఆకాశాన్ని ప్రకాశవంతం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బయటి  లైటింగ్, స్ట్రీట్ లైటింగ్, ప్రకటనలు,  ప్రకాశవంతమైన క్రీడా వేదికల విచక్షణారహిత వినియోగం ఇప్పుడు నక్షత్రాల చూసే మన దృష్టిని కప్పేస్తుంది.

జర్మన్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్త క్రిస్టోఫర్ కైబా చేసిన పరిశోధన ప్రకారం, కాంతి కాలుష్యం ఇప్పుడు రాత్రి ఆకాశంలో సంవత్సరానికి 10% చొప్పున ప్రకాశవంతంగా మారుతుందని, ఇది చాలా   ప్రకాశవంతమైన నక్షత్రాలను మినహాయించి అన్నింటిని   కనిపించకుండా చేసే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఈ తరంలో పుట్టిన వారు రాత్రిపూట 250 నక్షత్రాలు కనిపించే చోట వారు 18 ఏళ్లు వచ్చేసరికి దాదాపు 100 మాత్రమే చూడగలుగుతారు  అని అన్నారు. 

Latest Videos

click me!