టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది నయా మోసాలు, స్కామ్ లు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా సైబర్ నేరాల బారినపడుతూ ఆర్థికంగా నష్టపోవడంతో పాటు మానసికండా కుంగిపోతున్న కేసులు పెరుగుతుండటం ఈ తరహా నేరాల పెరుగుదల ప్రభావాలను ఎత్తిచూపుతోంది. ఇదే క్రమంలో ప్రముఖ యూట్యూబర్ అంకుష్ బహుగుణ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు ఎదురైన బాధాకరమైన అనుభవాన్ని పంచుకున్నారు. అతను 40 గంటల డిజిటల్ అరెస్ట్ స్కామ్‌కు ఎలా బాధితుడయ్యాడో వెల్లడించాడు. తనలా ఇంకోకరు బాధపడకుండా ఉంటేందుకు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన ప్రస్తావించారు.
తమకు కూడా ఇలాంటి సందర్భాలు ఎదురైతే ఎలా సిద్ధంగా ఉండాలో అంకుష్ బహుగుణ కథ చెబుతోంది. అతను బాధితులపై తీర్పు ఇవ్వకుండా జాగ్రత్తలతో పాటు హెచ్చరించాడు. ఇది ప్రజలు ఎలా భిన్నంగా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడం గురించి నొక్కి చెప్పారు.
అంకుష్ బహుగుణకు ఎదురైన స్కామ్ ఏంటి?
అంకుష్ బహుగుణ ఎదుర్కొన్న స్కామ్ సైబర్ నేరానిక సంబంధించినది. అదే డిజిటల్ అరెస్ట్. టెక్నాలజీని ఉపయోగించుకుని కొందరు దుండగులు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. అంకుష్ తనకు ఎదురైన డిజిటల్ అరెస్టు స్కామ్ గురించి చెబుతూ.. మీకు తెలియని, మరీ ముఖ్యంగా అంతర్జాతీయ కాల్స్, మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండటాన్ని నొక్కి చెప్పారు. ముఖ్యంగా బెదిరింపులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాల ఆరోపణలను కలిగిన వాటి విషయంలో మీ స్పందనలు ఎలా ఉండాలనే విషయాలు కూడా ప్రస్తావించారు.
అకుష్ బహుగుణ కథనం.. డిజిటల్ స్కామ్‌లలో ఉపయోగించే అధునాతన వ్యూహాలను హైలైట్ చేస్తుంది. ఇందులో వ్యక్తిగత సమాచారాన్ని దోపిడీ చేయడం, మానసికంగా ఎలా దెబ్బకొడతారు, ఎదుటివారిని ఎలా భయపెడతారు అనే విషయాలు నొక్కి చెబుతుంది. దురదృష్టవశాత్తూ, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల విస్తరణ మోసగాళ్లు ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం సులభతరం చేసింది. అంటే ప్రజలు ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎత్తిచూపుతుంది.
మోసగాళ్ల బెదిరింపులు
అంకుష్ బహుగుణ డిజిటల్ అరెస్ట్ స్కామ్ లో ఎలా చిక్కుకున్నారు?
తనకు ఎదురైన పరిస్థితి పగోనికి కూడా రావద్దని పేర్కొంటూ అంకుష్ బహుగుణ తాను ఎదుర్కొన్న డిజిటల్ అరెస్టు స్కామ్ గురించి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. సోషల్ మీడియా నుండి మూడు రోజుల విరామం తర్వాత.. సైబర్ మోసగాళ్ళు తనను ఎలా డిజిటల్ అరెస్టులో ఉంచారో బహుగుణ వెల్లడించాడు. ఈ మోసం కారణంగా తాను డబ్బును కోల్పోవడంతో పాటు తీవ్రమైన మానసిక కుంగుబాటుకు గురయ్యానని చెప్పారు. “నేను గత మూడు రోజులుగా సోషల్ మీడియా నుండి, ప్రతిచోటా కనిపించకుండా పోయాను. నన్ను కొంతమంది స్కామర్లు 40 గంటలు డిజిటల్ అరెస్టులో ఉంచారు. ఈ సమయంలో నేను డబ్బును పోగొట్టుకున్నాను, నా మానసిక ఆరోగ్యాన్ని కోల్పోయాను, ఇది నాకు జరిగిందని నమ్మలేకపోతున్నాను” అంటూ బహుగుణ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపారు.
'డిజిటల్ అరెస్ట్'లో ఎలా ఉన్నాడు?
+1 కోడ్ తో ఒక ఆటోమేటెడ్ అంతర్జాతీయ కాల్ తన ఫోన్ కు వచ్చింది. దాన్ని స్వీకరించిన తర్వాత కొరియర్ డెలివరీ గురించి తనకు తెలిపారని చెప్పారు. "ఇది అంతర్జాతీయ కాల్ కోడ్ లా కనిపించింది. నేను పెద్దగా ఆలోచించకుండా కాల్ లిఫ్ట్ చేశాను. వెంటనే అవతలి వైపు నుంచి మీ కొరియర్ డెలివరీ రద్దు చేశారు. సహాయం కోసం 1 నొక్కండి అని సూచించింది. ఆ తర్వాత 1 నొక్కడంతో.. కస్టమర్ ప్రతినిధి కాల్ ను తీసుకున్నారు.
అతను మాట్లాడుతూ.. మీ పార్సిల్ లో అక్రమ వస్తువులు ఉన్నాయనీ, కస్టమ్స్ అధికారులు జప్తు చేసినట్టు తెలిపారు. అలాగే, నా ఆధార్ కార్డు, పాన్ కార్డు సహా ఇతర వివరాలను అందులో ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు మీరు డిజిటల్ అరెస్టులో ఉంటారని చెప్పారు. ఈ నేరంలో మీరు ప్రధాన నిందితుడు. అరెస్టు వారెంట్ ఉందని 40 గంటల పాటు ఎవరితోనూ మాట్లాడకుండా వీడియో కాల్‌లో ఉంచారని" చెప్పారు.
40 గంటల పాటు ఎవరితోనూ మాట్లాడకుండా ఉంచారు
"నేను అక్కడికి వెళ్ళడానికి తగినంత సమయం లేనందున అతను నేరుగా పోలీస్ స్టేషన్‌కు కనెక్ట్ చేసి నాకు సహాయం చేస్తానని చెప్పాడు. యూనిఫాం ధరించిన పోలీసు అధికారిలా కనిపిస్తూ కాల్ ను వాట్సాప్ వీడియో కాల్ కు మార్చాడు. దీంతో భయం మరింత పెరిగింది. ఈ మోసగాళ్లు ఆ సమయంలో తాను ఎవరికీ అందుబాటులో ఉండకుండా తన డిజిటల్ డివైస్ లను ఆఫ్ చేయమన్నారు. నా వ్యక్తిగత సమాచారం తీసుకున్నారు. నిరంతరాయంగా వీడియో కాల్‌లో ఉన్నప్పుడు 40 గంటల పాటు ఎవరితోనూ మాట్లాడకుండా ఉంచారు.
ఈ సమయంలో నన్ను బ్యాంకు కూడా పంపారు. అయితే, బ్యాంకు మూసివేయడంతో మరింత డబ్బును కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకున్నాను. అప్పుడు వాళ్లు నన్ను మార్కెట్ కు పంపారు. ఇదే సమయంలో ఈ తరహా సైబర్ మోసాల గురించి నా స్నేహితుడు ఒకరు మెసేజ్ పంపడంతో నేను మోసపోయాను అని గ్రహించాను" అని బహుగుణ తెలిపాడు. స్కామర్లు ఎలా మనల్ని భయపెట్టి ఆర్థికంగా, మానసికంగా మనల్ని ఇబ్బందులకు గురిచేస్తారో బహుగుణకు జరిగిన మోసం చెబుతోంది.
'డిజిటల్ అరెస్ట్' స్కామ్ అంటే ఏమిటి?
గత కొన్ని నెలలుగా, మీరు "డిజిటల్ అరెస్ట్" అనే పదాలు విని ఉండవచ్చు. డిజిటల్ అరెస్టు అంటే చట్టాన్ని అమలు చేసే సంస్థలు, వ్యక్తులుగా నటిస్తూ మోసాలకు పాల్పడే వారు బాధితులకు ఫోన్ చేసి, పన్ను ఎగవేత లేదా మనీలాండరింగ్ వంటి పెద్ద నేరాలకు పాల్పడినట్లు నిందిస్తారు. ఈ స్కామర్‌లు వారిని నిందితులుగా చూపుతూ నకిలీ నోటీసులు, ఆరోపణల పత్రాలను చూపిస్తారు. మొత్తంగా బాధితుల్లో భయాన్ని పెంచి మీపై అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయని చెబుతారు. ఎవరితోనూ మాట్లాడనీయకుండా మీతో సాధారణ కాల్ లేదా వీడియో కాల్ లో ఉంచుతారు. జైలు శిక్ష నుంచి తప్పించడానికి డబ్బును డిమాండ్ చేస్తారు. నిరంతరం కాల్స్ లేదా టెక్స్ట్‌లు పంపుతారు. మొత్తంగా మిమ్మల్ని ఆర్థికంగా, మానసికంగా దెబ్బకొడతారు.
అయితే, ఇలాంటి సైబర్ నేరాలు, భారతీయ శిక్షాస్మృతిలో "డిజిటల్ అరెస్ట్" అనే పదబంధం లేదు. మీరు సైబర్ నేరాల బాధితులు కాకుండా మీకు తెలియని వ్యక్తుల కాల్స్ స్వీకరించే ముందు జాగ్రత్తగా ఉండాలి. అంతర్జాతీయ కాల్స్ ని స్వికరించకపోవడం ఉత్తమం. మీపై నేరాలు ఉన్నాయనే భయపెట్టే కాల్స్ వస్తే కట్ చేసి వెంటనే పోలీసులను సంప్రదించాలి. లేదా ఆ నెంబర్ లను పోలీసులకు కాల్ చేసి చెప్పాలి.
ఇది కూడా చదవండి:
ఏమిటీ డిజిటల్ అరెస్ట్ ? మీకు ఇలాంటి పరిస్థితే వస్తే ఏం చేయాలి?