AI కాదు, దానికి మించి వచ్చినా.. ఈ 10 ఉద్యోగాల్లో మనుషులను రిప్లేస్ చేయలేదు

First Published Aug 14, 2024, 10:30 AM IST

అసలు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) రీప్లేస్‌ చేయలేని జాబ్స్‌ ఉన్నాయా? అంటే.. అవుననే సమాధానం వస్తోంది. ఈ 10 రంగాల్లో మాత్రం నిపుణులు, సామర్థ్యాలున్న వారిని AI కాదు కదా, అంతకు మించింది వచ్చినా రీప్లేస్‌ చేయలేదు.

ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రతి రంగంలోనూ టెక్నాలిజీ ఆధారంగా సేవలు మొదలైపోయాయి. ఇక, టెక్నాలజీకి కొత్త అప్డేట్‌లా అభివృద్ధి చేసిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేథ) అద్భుతాలు చేస్తోంది. గంటల్లో చేసే పనిని నిమిషాలు, సెకండ్లలో చేస్తూ ఆ పనిచేసే మనుషులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ప్రత్యేకించి సాఫ్ట్‌వేర్‌ లాంటి రంగాల్లో అయితే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఉద్యోగులకు సవాల్‌ విసురుతోంది. ఇప్పటికే కొన్ని సాంకేతిక, ప్రోగ్రామింగ్‌ పనుల్లో ఉద్యోగులకు కృత్రిమ మేథ ప్రత్యామ్నాయంగా మారిపోయింది. 

artificial intelligence

మార్కెట్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రాకతో కొత్త అనుమానాలు, భయాలు మొదలయ్యాయి. ఇప్పటికే అనేక కీలక డొమైన్లలో మనుషులకు ప్రత్యామ్నాయంగా AI పనిచేస్తోంది. ప్రత్యేకించి ఇండియాలో AI అనేక పనులను ఆటోమేట్‌ చేయడం ద్వారా ఉపాధి రంగాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తోంది. కొన్ని పరిశ్రమల్లో ఉద్యోగుల స్థానాన్ని రీప్లేస్‌ చేసింది. అయితే, AI - సంబంధిత రంగాల్లో కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తుందన్న వాదనలూ ఉన్నాయి.

ఈ భయాల నేపథ్యంలో అసలు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) రీప్లేస్‌ చేయలేని జాబ్స్‌ ఉన్నాయా? అంటే.. అవుననే సమాధానం వస్తోంది. ఈ 10 రంగాల్లో మాత్రం నిపుణులు, సామర్థ్యాలున్న వారిని AI కాదు కదా, అంతకు మించింది వచ్చినా రీప్లేస్‌ చేయలేదని నిపుణులు అంటున్నారు.

Latest Videos


AI vs Humans

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఎంత అభివృద్ధి చెందినా కొన్ని వృత్తులకు మాత్రం ప్రత్యామ్నాయంగా మారలేకపోతోంది. ఆయా వృత్తుల్లో మానవులదే పైచేయిగా నిలుస్తోంది. సృజనాత్మకత, భావోద్వేగాలకు సంబంధించిన మేధస్సు, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ లాంటి ముఖ్యమైన 10 పనుల్లో మనుషులను AI రీప్లేస్‌ చేయలేదు. 

థెరపిస్టులు, కౌన్సిలర్లు

కృత్రిమ మేథ థెరపిస్టులు, కౌన్సిలింగ్‌ ఇచ్చేవారిని రిప్లేస్‌ చేయలేదు. ట్రస్ట్‌, ఎమోషనల్‌ కనెక్షన్‌తో సంబంధం ఉన్న ఈ రెండు పనులను చేయడం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ తరం కాదు. ఎందుకంటే చికిత్సకు సంబంధించిన పనులు, కౌన్సిలింగ్‌, సలహాలు ఇచ్చేందుకు మనసు, భావోద్వాగాలతో ముడిపడి ఉంటుంది. 

ఆర్టిస్టులు

కళ అనేది చాలా ప్రత్యేకమైంది. మనుషులు మాత్రమే భావోద్వేగ పూరితమైన రియల్ ఆర్ట్‌ని సృష్టించగలరు. ఆర్ట్‌లో హ్యూమన్‌ టచ్‌ చూపించిన ప్రభావం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) చూపించలేదు. ఎందుకంటే కళాకారులకు ఉండే అంత అనుభవం AIకి ఉండదు.

AI vs Humans

స్ట్రాటజిస్టులు, అనలిస్టులు (ఉన్నత స్థాయి వ్యూహకర్తలు, విశ్లేషకులు)

వ్యూహకర్తలు, విశ్లేషకులు వారి సృజనాత్మకత, అంతర్‌ దృష్టి, వ్యూహాత్మక ఆలోచనలను ఉపయోగించి క్లిష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయాలు వెల్లడిస్తారు. అయితే, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కేవలం డేటాను మాత్రమే విశ్లేషిస్తుంది. మనిషిలాగా దూరదృష్టితో ఆలోచించలేదు. 

సైంటిస్టులు
ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ప్రతి టెక్నాలజీ వెనుక శాస్త్రవేత్తలు కృషి చాలానే ఉంది. సైంటిస్టులు క్రిటికల్‌ థింకింగ్‌, అపారమైన నాలెడ్జ్‌తో సవాళ్లను అధిగమించే పనులు చేస్తారు. అధునాతన ఆవిష్కరణలకు ప్రాణం పోస్తారు.  ఈ పనుల్లో మనుషులకు AI సాయం చేయగలదే కానీ, పూర్తిస్థాయిలో సొంతంగా పనిచేయలేదు.

customer service centres

కస్టమర్‌ సర్వీసు ప్రతినిధులు

కస్టమర్ సర్వీసు అనేది చాలా సహనంతో కూడుకున్న పని. సంక్లిష్టమైన, భావోద్వేగ పరిస్థితులను కస్టమర్ సర్వీసు ప్రతినిధులు హ్యాండిల్‌ చేస్తుంటారు. AI సాధారణ సలహాలు ఇవ్వగలదే కానీ, వేర్వేరు సంక్లిష్టమైన పరిస్థితుల్లో సమస్యలను పరిష్కరించడం, నిర్ధారించడం లాంటి పనులను చేయలేదు. ఇందుకోసం హ్యూమన్‌ బ్రెయిన్‌ అవసరం.

సర్జన్స్‌, హెల్త్‌ కేర్‌ ప్రొఫెషనల్స్‌

వైద్య నిపుణులు, సర్జన్లు ఒత్తిడిలో పనిచేస్టుంటారు. క్రిటికల్‌ స్టేజ్‌లో ఉండే పేషెంట్లకు కూడా తమ వృత్తి నైపుణ్యంతో చికిత్స అందించి సాధారణ స్థితికి తీసుకొస్తారు. మానవ శరీర నిర్మాణానికి సంబంధించి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం మానవ నైపుణ్యమే అవసరం అవుతుంది. అయితే ఈ పనుల్లో మనుషులకు ఏఐ సహకరించగలదే కానీ, ప్రత్యామ్నాయంగా మారలేదు.

AI vs Humans

ప్రొఫెషనల్ అథ్లెట్లు

ఫిజికల్‌ స్కిల్స్‌తో పాటు స్ట్రాటజీ, పరిస్థితులకు తగ్గట్టు వ్యవహరించడం క్రీడల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. క్రీడల్లో మానవ స్ఫూర్తి, అంకితభావం, పనితీరును AI రీప్లేస్‌ చేయలేదు.

మీడియా, జర్నలిస్టులు

నిజానిజాలను వెలికితీయడం, వ్యవస్థలను జవాబుదారీగా ఉంచడంలో మీడియా, జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తారు. మనుషులతో కనెక్ట్‌ అయ్యే, ఇంకా సంక్లిష్టమైన కథనాలను ఆకర్షణీయంగా అర్థమయ్యేలా చెప్పగల సామర్థ్యం మనుషులకే ఉంటుంది. జర్నలిస్టులను AI రీప్లేస్‌ చేయలేదు.

AI vs Humans

టీచర్లు...

సమర్థులైన భావి పౌరులను తీర్చిదిద్ది, వివిధ వృత్తుల్లో నిపుణులకు పునాది వేసేవారు ఉపాధ్యాయులు. అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను ప్రోత్సహించడం, గైడెన్స్‌ అందించడం ఎడ్యుకేషన్‌ రంగంలో కీలక భూమిక పోషిస్తుంది. విద్యార్థుల వ్యక్తిగత ఎదుగుదలకు విద్యా బోధనలో లోతైన మానవ స్పర్శ, వ్యక్తిగత సంబంధాలు అవసరం. ఇది ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ చేయలేని పని అని చెప్పవచ్చు.

click me!