Latest Videos

ఇస్రోకి మరో మైలురాయి: గగన్యాన్ మిషన్ టెస్ట్ లాంచ్ సక్సెస్..ఈ 9 నిమిషాల్లో ఎం జరిగిందంటే..?

First Published Oct 21, 2023, 1:39 PM IST

 ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏరోనాటికల్ మిషన్ తొలి మానవరహిత  రాకెట్ టెస్ట్  విజయవంతంగా ప్రయోగించింది. శనివారం ఉదయం 8 గంటలకు ప్రయోగించాల్సిన ఇస్రో అంతరిక్ష యాత్ర కొంత సేపు వాయిదా పడి ఉదయం 10 గంటలకు విజయవంతమైంది. 
 

ఉదయం ఈ రాకెట్ ప్రయోగానికి మొదట్లో కొంత ఇబ్బంది ఎదురైనా చివరికి మిషన్ విజయవంతమైంది. ఈ విషయాన్ని ఇస్రో ప్రెసిడెంట్ సోమనాథ్ తెలియజేస్తూ.. ఇస్రో ప్రయోగం విజయవంతమైందన్నారు. అలాగే, అంతరిక్ష యాత్రలో పనిచేసిన ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. 

ఆంధ్రాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ లాంచ్ సెంటర్ నుండి 17 కి.మీ.ల దూరంలో ఈ రాకెట్ ప్రయోగించారు. అత్యంత ఎత్తులో స్పెస్ క్రాఫ్ట్ వేరు చేయబడింది. తరువాత పారాచూట్ సహాయంతో బంగాళాఖాతంలో ల్యాండ్ చేసి, అక్కడ నుండి షిప్ ద్వారా అదుపులోకి తీసుకున్నారు.

లాంచ్ టెస్ట్ ?
శనివారం ఉదయం సతీష్ ధావన్ లాంచ్ సెంటర్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ టెస్ట్  కోసం ప్రత్యేకంగా తయారు చేసిన రాకెట్‌ను స్పెస్   షటిల్ మోడల్ తో ప్రయోగించారు. 1 నిమిషం తర్వాత 11.7 కి.మీ. ఎత్తైన రాకెట్ షిప్ నుండి వేరు చేయబడింది. నిమిషానికి 16 కి.మీ. ఎత్తుకు చేరుకున్న తర్వాత స్పేస్‌క్రాఫ్ట్ సిబ్బంది మాడ్యూల్ పైన అమర్చిన బూస్టర్ నుండి విడిపోయి భూమి వైపు పడటం ప్రారంభిస్తుంది. 
 

ISRO, Gaganyaan, crew module

ఈ సమయంలో స్పెస్ క్రాఫ్ట్  అండ్ సిబ్బందిని రక్షించే ఎక్విప్మెంట్  రెండూ విడిపోయి సముద్రంలో పడిపోయాయి. ఇలా రాకెట్ నుంచి విడిపోయిన 5 సెకన్ల తర్వాత షిప్ లో  పారాచూట్ విడుదలై  దాని స్పీడ్ నియంత్రించి భూమిపైకి తీసుకువస్తుంది. 3 నిమిషాల పాటు ఈ పారాచూట్ సహాయంతో క్రాఫ్ట్ ల్యాండ్ అయింది. తర్వాత మరో శక్తివంతమైన పారాచూట్ తెరుచుకోవడంతో క్రాఫ్ట్ సురక్షితంగా సముద్రంలో ల్యాండ్ అయింది.

కేవలం 9 నిమిషాల్లోనే టెస్ట్  పూర్తి చేసి, ప్రయోగ స్థలానికి 10 కిలోమీటర్ల దూరంలోని బంగాళాఖాతం నుంచి క్రాఫ్ట్  సురక్షితంగా వెలికి తీశారు. ఈ పరీక్ష నిర్వహించడానికి ముందు, ఇస్రో క్రాఫ్ట్ ను చాలాసార్లు పరీక్షించింది. అదనంగా, ఇంజిన్, పారాచూట్ ఇంకా షిప్ ల్యాండింగ్ అన్నీ విజయవంతంగా పరీక్షించబడ్డాయి, చివరకు ఈ మానవరహిత స్పెస్ క్రాఫ్ట్   టెస్ట్ నిర్వహించబడింది.
 

click me!