ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్
భారత గ్రాండ్‌మాస్టర్ డి. గుకేష్ చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నారు. ప్రపంచ వేదికపై భారత్ కు గర్వకారణమైన 18 ఏళ్ల గుకేష్‌కు క్రీడారంగంలో అత్యున్నత గౌరవం 'ఖేల్ రత్న' అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
2024లో గుకేష్ అమెరికా అధ్యక్షుడి కంటే రెట్టింపు సంపాదించినట్లు వార్తలు వచ్చాయి. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచినందుకు గుకేష్‌కు 15,77,842 అమెరికన్ డాలర్ల బహుమతి లభించింది. ఇది భారత కరెన్సీలో 13.6 కోట్ల రూపాయలకు సమానం.
గుకేష్ 2024 ఆదాయం
గుకేష్ కు తమిళనాడు సర్కారు భారీ నజరానా
ఈ విజయం తర్వాత తమిళనాడు ప్రభుత్వం గుకేష్‌కు రూ. 5 కోట్ల బహుమతిని ప్రకటించింది. అంతేకాకుండా, గుకేష్ చదివిన వేలమ్మాళ్ స్కూల్ ఆయనకు ఖరీదైన బెంజ్ కారును బహుమతిగా అందజేసింది. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచినందుకు గుకేష్‌కు లభించిన 15,77,842 డాలర్లు అమెరికా అధ్యక్షుడి వార్షిక ఆదాయం కంటే ఎక్కువ.
అమెరికా అధ్యక్షుడి ఆదాయం
అమెరికా అధ్యక్షుడికి ఖర్చుల కోసం 50,000 డాలర్లు, ప్రయాణాల కోసం 100,000 డాలర్లు, వినోదం కోసం 19,000 డాలర్లు అదనంగా లభిస్తాయి, మొత్తం వార్షిక ఆదాయం 519,000 డాలర్లు. ఇది గుకేష్ 2024లో సంపాదించిన బహుమతి కంటే రెట్టింపు.
ఇందులో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన రూ. 5 కోట్లు, ఇతర బహుమతులు ఉండవు. వాటిని కూడా కలిపితే, గుకేష్ 2024 ఆదాయం అమెరికా అధ్యక్షుడి ఆదాయం కంటే మూడు రెట్లు ఎక్కువ.
ప్రజ్ఞానంద ఎంత సంపాదించారు?
గుకేష్ 2024లో 8 ప్రధాన టోర్నమెంట్లలో ఆడటం గమనార్హం. గుకేష్ చేతిలో ఓడిపోయిన చైనాకు చెందిన డింగ్ లిరెన్‌కు 11,83,600 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో 9.90 కోట్ల రూపాయలు) బహుమతిగా లభించింది. తమిళనాడు ఆటగాడు ప్రజ్ఞానంద 2,02,136 అమెరికన్ డాలర్లు (1.74 కోట్ల రూపాయలు), నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్‌సెన్ 6,33,369 అమెరికన్ డాలర్లు (5.45 కోట్ల రూపాయలు) బహుమతిగా అందుకున్నారు.
ఎవరీ డీ.గుకేష్ ?
డి గుకేష్ పూర్తి గుకేష్ దొమ్మరాజు. మే 29, 2006లో జన్మించాడు. తెలుగు కుర్రాడైన గుకేష్ తల్లిదండ్రుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా. ప్రస్తుతం చెన్నైలో ENT సర్జన్ అయిన డాక్టర్ రజనీకాంత్, మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ పద్మ దంపతులకు జన్మించారు. తెలుగు కుటుంబానికి చెందిన గుకేశ్ ఏడేళ్ల వయసులో చదరంగం ఆడడం ప్రారంభించాడు. 2015లో ఆసియా స్కూల్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గుకేష్ తన మొదటి ప్రధాన మైలురాయిని- U9 విభాగంలో గెలుచుకున్నాడు. మూడు సంవత్సరాల తరువాత, అతను U12 ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.