మీరాబాయి ఇచ్చిన బూట్లతో కామన్వెల్త్‌ గేమ్స్‌కి... రజతం గెలిచిన బింద్యారాణి దేవీ...

First Published | Jul 31, 2022, 1:29 PM IST

కామన్వెల్త్ గేమ్స్ 2022లో తొలి రోజు భారత్‌ నాలుగు పతకాలు సాధించింది. ఒలింపిక్ మెడలిస్ట్ మీరాబాయి ఛాను గోల్డ్ మెడల్ గెలవగా పురుష వెయిట్ లిఫ్టర్ సంకేత్ సర్గర్ రజతం గెలిచాడు. గురురాజ పూజారి కాంస్యం గెలవగా మరో మహిళా వెయిట్‌లిఫ్టర్ బింద్యారాణి దేవి రజతం గెలిచింది.

sanket sargar

బర్మింగ్‌హమ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్ గేమ్స్‌లో తొలి రోజు భారత్‌కి నాలుగు పతకాలు దక్కాయి. 55 కేజీల పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ సంకేత్ మహదేవ్ సర్గర్.. రజతం పతకం గెలిచి భారత్‌కి తొలి పతకం అందించాడు....

స్కాచ్ కేటగిరిలో 113 కేజీలను ఎత్తిన సంకేత్, సీ అండ్ జే ఈవెంట్‌లో 135 కేజీలను ఎత్తి... ఓవరాల్‌గా 248 కేజీలతో రెండో స్థానంలో నిలిచాడు. మలేషియాకి చెందిన మహ్మద్ అనీక్, 249 కేజీలతో టాప్‌లో నిలిచి స్వర్ణం సాధించాడు. రెండో స్థానంలో నిలిచిన సంకేత్‌కి, అనీక్‌కి మధ్య తేడా కేవలం ఒక్క కేజీ మాత్రమే... 


gururaja

పురుషుల 61 కిలోల కేటగిరలో పోటీపడిన గురురాజ పూజారా, 269 కేజీలను ఎత్తి కాంస్యం గెలిచాడు. స్నాచ్ విభాగంలో 118 కిలోలు లిఫ్ట్ చేసిన గురురాజ, క్లీన్ అండ్ జెర్క్‌లో 153 కిలోలను ఎత్తాడు. మలేషియాకి చెందిన అజ్నీల్ బిన్ బిడిన్ అహ్మద్ 285 కిలోలతో స్వర్ణం గెలవగా, పపువా న్యూ గినీకి చెందిన మోరియా 273 కిలోలు ఎత్తి రజతం గెలిచాడు...

Image credit: Getty

టోక్యో ఒలింపిక్స్‌ మెడలిస్ట్, వుమెన్ వెయిట్‌ లిఫ్టర్ మీరాబాయి ఛాను... 49 కేజీల విభాగంల భారత్‌కి తొలి స్వర్ణం అందించింది.  స్నాచ్‌లో 88 కిలోలను లిఫ్ట్ చేసిన మీరా భాయి ఛాను, క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కిలోలను ఎత్తి టాప్‌లో నిలిచింది...

Image credit: PTI

మరో భారత వుమెన్ వెయిట్‌లిఫ్టర్ బింద్యారాణి దేవీ 55 కేజీల విభాగంలో రజతం గెలిచింది. స్నాచ్ రౌండ్‌లో తొలి ప్రయత్నంలో 81 కేజీలు లిఫ్ట్ చేసిన బింద్యారాణి దేవీ, ఆ తర్వాత 84 కేజీలు, మూడో ప్రయత్నంలో 86 కేజీలు ఎత్తింది. స్నాచ్‌లో 55 కేజీల విభాగంలో ఇదే అత్యుత్తమ ప్రదర్శన...

Bindyarani Devi

ఆ తర్వాత క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో 116 కేజీలు ఎత్తింది. మొత్తంగా 202 కేజీలతో రెండో స్థానంలో నిలిచిన 23 ఏళ్ల బింద్యారాణి దేవీ, భారత్‌కి నాలుగో పతకం అందించింది. స్వర్ణం గెలిచిన వెయిట్‌లిఫ్టర్‌కి, బింద్యారాణికి తేడా కేవలం ఒక్క కేజీ మాత్రమే...

టోక్యో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన మీరాబాయి ఛానును రోల్ మోడల్‌గా భావించే బింద్యారాణి దేవి, బూట్లు కూడా కొనుక్కోలేని కడు పేదరికం నుంచి వచ్చి అంతర్జాతీయ వేదికపై భారత పతకాన్ని రెపరెపలాడించింది. మీరాబాయి చానులాగే మణిపూర్ నుంచి వచ్చిన బింద్యారాణి దేవీ, ఒకే అకాడమీలో శిక్షణ తీసుకున్నారు...

ఓ చిన్న గుడిసెలో జీవనం సాగించిన మీరాబాయి ఛాను లైఫ్‌ స్టైల్, ఒలింపిక్ మెడల్ తర్వాత పూర్తిగా మారిపోయింది. అయితే తనలాగే దారిద్య్ర రేఖ దిగువన ఉంటూ, భారత్‌కి పతకాలు సాధించాలనే పట్టుదలతో ప్రయత్నిస్తున్న బింద్యారాణి దేవి ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న మీరాబాయి ఛాను... ఖరీదైన బూట్లను కానుకగా ఇచ్చిందట..

Image credit: PTI

‘నా సక్సెస్‌లో మీరా దీ పాత్ర చాలా ఉంది. నా టెక్నిక్‌, ట్రైయినింగ్‌లో మీరా ఎంతగానో సాయం చేసింది. క్యాంప్‌లోకి కొత్తగా వచ్చినప్పుడు ఎంతో అప్యాయంగా పలకరించి, మాట్లాడింది. నా దగ్గర బూట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవని తెలిసి, తన షూస్ నాకు ఇ్చింది. ఆమె నాకు ఆదర్శం... నేను తనకి పెద్ద అభిమానిని అయిపోయా...’ అంటూ చెప్పుకొచ్చింది బింద్యారాణి దేవి...

Latest Videos

click me!