వినేష్ పోగట్ ఒలింపిక్ మెడల్ తీర్పు... కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ కీలక నిర్ణయం

First Published | Aug 13, 2024, 9:48 PM IST

భారత రెజ్లర్ వినేష్ పోగట్ ఒలింపిక్ పతకంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆమెకు ఒలింపిక్ పతకం దక్కుతుందా లేదా అన్నది కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ప్రకటించలేదు. 

Vinesh Phogat

భారత రెజ్లర్ వినేష్ పోగట్ అనర్హత వేటుపై  కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ తీర్పు మరింత ఆలస్యం కానుంది. ఇవాళ తీర్పును వెల్లడించాల్సి వుండగా ఆగస్ట్ 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు (పారిస్ టైమ్) తీర్పు వెల్లడించనున్నట్లు సిఏఎస్ ప్రకటించింది. దీంతో పోగట్ ఒలింపిక్ మెడల్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. 
 
 

Vinesh Vinesh

పారిస్ ఒలింపిక్స్ లో భారత స్వర్ణ పతక ఆశలను ఒలిపింక్స్ నిర్వహకుల నిర్ణయం గల్లంతు చేసింది. అద్బుత ప్ర‌ద‌ర్శ‌న‌తో వినేష్ ఫోగ‌ట్ రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఫైన‌ల్ కు చేరుకుంది. అయితే గోల్డ్ మెడ‌ల్ ఫైట్ కు ముందు రెజ్లర్ వినేష్ నే కాదు యావత్ భారతీయులను షాక్ కు గురిచేసే నాటకీయ సంఘటన చోటుచేసుకుంది. చేతికందిన ఒలింపిక్ మెడల్ ను లాక్కునేలా పోగట్ పై అనర్హత వేటు వేసారు. 

Latest Videos


Vinesh Phogat

రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో పోటీ పడుతున్న వినేష్ ఫైనల్ సిద్దమైన వేళ బాంబు పేల్చారు ఒలింపిక్స్ నిర్వహకులు. ఉదయం ఆమె బరువు చెక్ చేయగా 100 గ్రాములు ఎక్కువగా వుంది... ఇలా 50కిలోల కంటే అధిక బరువు ఉన్నందున అన‌ర్హ‌త‌ వేటు వేసారు. దీంతో పోగట్ ఫైనల్ కు దూరమయ్యారు. 

Vinesh Phogat

ఇలా గోల్డ్ మెడల్ సాధిస్తుందనుకున్న వినేష్ అసలు మెడ‌ల్ రేసు నుండే తప్పుకోవాల్సి వచ్చింది. ఫైనల్ కు అనర్హత వేటు వేసినా అంతకు ముందు ప్రదర్శనను పరిగణలోకి తీసుకుని సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలని ఆమె కోరారు. భారత ఒలింపిక్ సంఘం కూడా ఇదే కోరింది. అయినా పారిస్ ఒలింపిక్స్ నిర్వహకులు పట్టించుకోకపోవడంతో వినేష్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)ని ఆశ్రయించారు. తనకు సిల్వ‌ర్ మెడ‌ల్ ను ప్రదానం చేయాలని డిమాండ్ చేస్తూ సీఏఎస్ లో న్యాయపోరాటం చేసారు. 
 

Vinesh Phogat

అయితే అన‌ర్హ‌త వేటుతో నిరాశ‌కు గురైన వినేష్ ఫోగ‌ట్ రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు. ఆమె నిర్ణయం క్రీడాప్రియులను ఎంతగానో కలచివేసింది. ఈ క్రమంలో తాజాగా సిఏఎస్ వినేష్ పోగట్ మెడల్ నిర్ణయాన్ని పొడిగించింది.

Vinesh Phogat

సిఏఎస్ కోర్టు తీర్పు వాయిదాతో వినేష్ మరికొన్ని రోజులు పారిస్ లోనే వుండాల్సి వస్తోంది. ఒలింపిక్స్ గేమ్స్ ముగిసినప్పటికి మెడల్ కోసం న్యాయపోరాటం చేస్తున్న ఆమె అక్కడే వున్నారు.  

Vinesh Phogat

ఇక సిఏఎస్ కోర్టు తీర్పు వాయిదాపై పోగట్ తరపు న్యాయవాది ఆసక్తికర కామెంట్స్ చేసారు. సహజంగా సిఏఎస్ కోర్టు తొందరగా తీర్పు ఇస్తుంది... కానీ పోగట్ విషయంలో ఇంత ఆలస్యం అవుతోందంటే తీర్పు పాజిటివ్ గా వచ్చే అవకాశం వుందన్నారు. ఈ కేసును విచారిస్తున్న ప్యానల్ లో మహిళా న్యాయమూర్తి కూడా వున్నారు... తీర్పు మనవైపే వుంటుందని ఆశిస్తున్నామని విదుష్పత్ సింగానియా తెలిపారు.  ఈయనతో పాటు ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే ఈ కేసును వాదిస్తున్నారు. 
 

click me!