కండోమ్‌లు ఇస్తాం, ఇంటికెళ్లి వాడుకోండి... సమ్మర్ ఒలింపిక్స్‌ 2021లో వింత సమస్య...

First Published | Jun 14, 2021, 7:12 PM IST

కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయంగా వాయిదా పడుతూ వచ్చాయి క్రీడా టోర్నీలు.  షెడ్యూల్ ప్రకారం గత ఏడాది జరగాల్సిన సమ్మర్ ఒలింపిక్స్‌ను ఈ ఏడాదికి వాయిదా వేశారు నిర్వాహకులు. సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నా, విశ్వక్రీడలను ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తిచేయాలని భావిస్తోంది ఒలింపిక్స్ అసోసియేషన్.

ఒలింపిక్స్ 2021 నిర్వహాకులకు కొత్త సమస్య వచ్చిపడింది. 1988లో సియోల్‌లో జరిగిన ఒలింపిక్స్ నుంచి విశ్వక్రీడలకు వచ్చే క్రీడాకారులందరికీ కండోమ్స్ అందించడం ఆనవాయితీగా వస్తోంది.
ప్రపంచదేశాలను పట్టిపీడించిన హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వ్యాధులపై అవగాహన కార్యక్రమంలో భాగంగా కండోమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని మొదలెట్టింది ఒలింపిక్స్ కమిటీ...

ఒలింపిక్స్‌కి వచ్చే క్రీడాకారులు వాడి పారేసే కండోమ్‌లతో డ్రైనేజీలు నిండిపోయి ఉండేవి. విశ్వక్రీడలు ముగిసిన తర్వాత వాటిని తీసివేయడం చాలా పెద్ద సమస్యగా మారేది...
కరోనా వైరస్ కారణంగా కండోమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేస్తారని టాక్ వినిపించింది. అయితే కండోమ్‌ల పంపిణీ నిలిపివేస్తే కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసిన టోక్యో ఒలింపిక్స్ నిర్వహకులు, క్రీడాకారులకు ప్రత్యేక సూచనలు ఇచ్చారు...
‘టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారుల కోసం లక్షా యాభై వేల స్పెషల్ కండోమ్‌లను సిద్ధం చేశాం. వాటిని ఆటగాళ్లను సరాఫరా చేస్తాం...
అయితే ప్రస్తుతం సోషల్ డిస్టెన్స్ నిబంధన అమలులో ఉండడంతో కండోమ్‌లను ఒలింపిక్ విలేజ్‌లో ఉపయోగించడానికి వీల్లేదు. అంటే ఒలింపిక్స్ ముగిసేసరికి ఎవ్వరూ శృంగారంలో పాల్గొనడానికి అవకాశం ఉండదు...
వాటిని స్వదేశానికి తీసుకెళ్లి వాడుకోవచ్చు. ఆటగాళ్లకు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ భోజన సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు కోట్లు ఖర్చు పెడుతున్నాం... ఈ సారి ప్రతిదీ ఛాలెంజింగ్ కానుంది’ అంటూ తెలిపింది ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ...
ఒలింపిక్స్ స్పోర్ట్స్ విలేజ్‌లో శృంగారం చేయడంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో మద్యపాన నిషేధాన్ని కూడా విధిస్తూ సర్క్యూలర్ జారీ చేసింది క్రీడా కమిటీ...
జపాన్‌లోని టోక్యో నగరం వేదికగా జూలై 23 నుంచి ప్రారంభమయ్యే ఒలింపిక్స్, ఆగస్టు 8న ముగుస్తాయి. ఈ విశ్వక్రీడల్లో 205 దేశాలు, 33 క్రీడా విభాగాల్లో పాల్గొనబోతున్నాయి.

Latest Videos

click me!