టోక్యో ఒలింపిక్స్: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా... టోక్యోలో టీమిండియాకి తొలి స్వర్ణం...

First Published | Aug 7, 2021, 5:39 PM IST

121 ఏళ్ల ఒలింపిక్ చరిత్రలో ఫీల్డ్ అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కి దక్కిన మొట్టమొదటి పతకం అందించిన నీరజ్ చోప్రా...

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం తెస్తాడని ఆశలు పెట్టుకున్న జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా... 130 కోట్ల మంది భారతీయుల ఆశలను నిలబెట్టాడు. ఒలింపిక్ చరిత్రలో ఫీల్డ్ అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కి దక్కిన మొట్టమొదటి పతకం ఇదే... 

మొదటి ప్రయత్నంలోనే 87.03 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా... ఫస్ట్ రౌండ్‌లో టాప్‌లో నిలిచాడు. రెండో ప్రయత్నంలో మరింత మెరుగ్గా 87.58 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా... మూడో ప్రయత్నంలో 76.79 మీటర్లు మాత్రమే విసరగలిగాడు. 


నాలుగో త్రో కూడా అనుకున్నంత లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో ఫౌల్ చేసిన నీరజ్ చోప్రా... ఐదో త్రో కూడా ఫౌల్ చేశాడు. అయితే మొదటి రెండు త్రోల కారణంగా చివరివరకూ టాప్‌లో నిలిచిన నీరజ్ చోప్రా, స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. 

వరల్డ్ నెం.1 జర్మనీకి చెందిన జొన్నెస్ వెట్టర్, టాప్ 8లో స్థానం సంపాదించలేక, ఫైనల్ రౌండ్‌కి అర్హత సాధించలేకపోయాడు. క్వాలిఫికేషన్స్‌లో టాప్ 3లో ఉన్న పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీం, ఫైనల్‌లో నిరాశపరిచాడు. 

నీరజ్ చోప్రా పతకంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 7కి చేరింది. ఒలింపిక్స్‌లో భారత్‌కి ఇదే అత్యుత్తమ ప్రదర్శన...  ఇంతకుముందు 2012 లండన్ ఒలింపిక్స్‌లో 2 రజతాలు, నాలుగు కాంస్య పతకాలు సాధించింది టీమిండియా... 

అంతకుముందు టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ భజరంగ్ పూనియా కాంస్యం సాధించాడు. మెన్స్ ఫ్రీ స్టైయిల్ 65 కేజీల విభాగంలో జరిగిన కాంస్య పతక పోరులో కజికిస్తాన్‌కి చెందిన డౌలెట్ నియాజ్‌బెకావ్‌తో జరిగిన మ్యాచ్‌లో భజరంగ్ పూనియా 8-0 తేడాతో విజయాన్ని అందుకున్నాడు.  

Latest Videos

click me!