టోక్యో ఒలింపిక్స్: భారత వుమెన్స్ హాకీ జట్టుకి రెండో విజయం... సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో....

First Published Jul 31, 2021, 10:47 AM IST

టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత మహిళా జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 4-3 తేడాతో గెలిచి, హ్యాట్రిక్ ఓటముల తర్వాత రెండు వరుస విజయాలను అందుకుంది... 

క్వార్టర్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మొదటి నుంచి దూకుడు చూపించింది టీమిండియా... ఆట ప్రారంభమైన నాలుగో నిమిషంలోనే గోల్ చేసిన వందన కటారియా, టీమిండియాకి 1-0 తేడాతో ఆధిక్యం అందించింది. అయితే తొలి క్వార్టర్ ఆఖరి నిమిషంలో గోల్ చేసిన సౌతాఫ్రికా 1-1 తేడాతో స్కోర్లను సమం చేసింది.
undefined
17వ నిమిషంలో వందన కటారియా మరో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి 2-1 ఆధిక్యం అందించింది. అయితే డిఫెన్స్‌లో తేలిపోయిన భారత జట్టు, 30వ నిమిషంలో ప్రత్యర్థికి గోల్ అందించింది. దీంతో తొలి సగం ముగిసేసరికి ఇరు జట్లూ 2-2 తేడాతో సమంగా నిలిచాయి.
undefined
32వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను సరిగ్గా వినియోగించుకున్న నేహా, గోల్ సాధించి భారత జట్టుకి 3-2 లీడ్ అందించింది. అయితే 39వ నిమిషంలో గోల్ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్ మరిజెన్ మరైజ్ 3-3 తేడాతో స్కోర్లను సమం చేసింది.
undefined
నాలుగో క్వార్టర్‌లో 49వ నిమిషంలో గోల్ చేసిన వందన కటారియా, భారత జట్టుకి 4-3 తేడాతో ఆధిక్యం దక్కింది. ఆధిక్యాన్ని నిలుపుకున్న టీమిండియా, మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది...
undefined
ఈ మ్యాచ్‌లో మూడు గోల్స్ చేసిన వందన కటారియా, ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ గోల్స్ చేసిన మొట్టమొదటి భారత హాకీ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసింది...
undefined
ఈ విజయంతో క్వార్టర్ ఫైనల్స్‌ చేరేందుకు టీమిండియాకి ఛాన్స్ లభించింది. అయితే ఐదో స్థానంలో ఉన్న ఐర్లాండ్ జట్టు, గ్రేట్ బ్రిటన్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడిపోవాల్సి ఉంటుంది.
undefined
టోక్యో ఒలింపిక్స్‌లో స్టార్ అథ్లెట్ల ఫెయిల్యూర్ పరంపరను కొనసాగిస్తూ సీమా పూనియా, డిస్కస్ త్రో ఈవెంట్‌లో నిరాశపరచగా, గ్రూప్ బీలో కమల్‌ప్రీత్ కౌర్ అద్భుత ప్రదర్శన ఇచ్చి ఫైనల్స్‌కి దూసుకెళ్లింది తొలి ప్రయత్నంలో 60.29, రెండో ప్రయత్నంలో 63.97, మూడో ప్రయత్నంలో 64.00 విసిరి ఆటోమెటిక్‌ క్వాలిఫికేషన్ సాధించింది. గ్రూప్ బీలో రెండో స్థానంలో నిలిచిన కమల్‌ప్రీత్ కౌర్, ఫైనల్స్‌కి దూసుకెళ్లగా... సీమా పూనియా క్వాలిఫికేషన్ రౌండ్ నుంచే తప్పుకుంది.
undefined
టోక్యో ఒలింపిక్స్‌లో శనివారం ఆరంభంలో భారత్‌కి ఆశించని ఫలితాలు దక్కలేదు. ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో భారత ఆర్చర్ అతానుదాస్, జపాన్‌ అథ్లెట్ టకహరు ఫురుకవాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలయ్యాడు.
undefined
బాక్సింగ్‌లో 52 కేజీల విభాగంలో టాప్ బాక్సర్ అమిత్ పంగల్ రెండో రౌండ్‌లోనే ఓడి, తీవ్రంగా నిరాశపరిచాడు. మొదటి రౌండ్‌లో బై లభించడంతో నేరుగా రెండో రౌండ్ చేరిన అమిత్, కొలంబియాకు చెందిన హెర్నీ మార్టినెజ్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-4 తేడాతో ఓడి, టోర్నీ నుంచి నిష్కమించాడు.
undefined
click me!