ఎమ్మెల్యే రోజాని కలిసిన పీవీ సింధు... కుటుంబంతో కలిసి లంచ్ చేసి...

First Published | Aug 20, 2022, 5:41 PM IST

భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు.. టీమిండియాకి గోల్డెన్ గర్ల్‌గా మారిపోయింది. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన పీవీ సింధు, కామన్వెల్త్ గేమ్స్ 2022లో స్వర్ణం గెలిచి చరిత్ర క్రియేట్ చేసింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో టైటిల్ నెగ్గిన ఏకైక భారత ప్లేయర్‌గా ఉన్న పీవీ సింధు... ఈసారి ఆ టోర్నీలో పాల్గొనడం లేదు...

కామన్వెల్త్ గేమ్స్ 2022 టోర్నీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అరికాలికి గాయం కావడంతో ఇబ్బంది పడిన పీవీ సింధు, అదే నొప్పితో సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచులు ఆడింది. గాయం ఇబ్బంది పెడుతుండడంతో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌కి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది పీవీ సింధు...

తాజాగా పీవీ సింధు, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే, వైసీపీ మంత్రి రోజాని కుటుంబంతో సహా కలిసింది. కామన్వెల్త్ గేమ్స్ 2022 విజయం తర్వాత స్వదేశం చేరుకున్న పీవీ సింధు, రోజా ఆహ్వానంతో ఆమె ఇంటికి కుటుంబంతో వెళ్లి ఆత్మీయంగా కలిసింది. ఈ సందర్భంగా పీవీ సింధుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది రోజా సెల్వమణి...


‘బంగారు పతకం సాధించిన మన ‘బంగారం’ సింధు, తన కుటుంబంతో వచ్చి నన్ను కలవడం చాలా ఆనందంగా ఉంది. నా కుటుంబంతో కలిసి సింధు, తన కుటుంబసభ్యులతో లంచ్ చేసింది..’ అంటూ ట్వీట్టర్‌లో పోస్టు చేసింది ఎమ్మెల్యే రోజా...

కామన్వెల్త్ గేమ్స్ 2022 వుమెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో కెనడా బ్యాడ్మింటన్ ప్లేయర్ మిచెల్ లీపై 21-15, 21-13 తేడాతో వరుస సెట్లలో ఘన విజయం అందుకుంది పీవీ సింధు. ఇంతకుముందు 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం, 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌ బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఫైనల్‌లో ఓడి రజతం సాధించిన పీవీ సింధు, ఈసారి ఏకంగా స్వర్ణం సాధించి... ‘ఇండియన్ గోల్డెన్ గర్ల్’గా కీర్తి ఘడించింది... 

Image credit: PTI

గాయం కారణంగా బీడబ్ల్యూఎఫ్ ఛాంపియన్‌షిప్స్ నుంచి తప్పుకున్న  తెలుగు తేజం పీవీ సింధు.. ఈ మెగా బ్యాడ్మింటన్ టోర్నీలో ఓ స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్య పతకాలతో మోస్ట్ సక్సెస్‌ఫుల్ భారత ప్లేయర్‌గా ఉంది...

Latest Videos

click me!