మిమ్మల్ని చూసి దేశమంతా గర్వపడుతోంది... బాక్సర్ మేరీకోమ్‌తో ప్రధాని మోదీ...

First Published | Jul 13, 2021, 6:33 PM IST

టోక్యో ఒలింపిక్స్ జూలై 23 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ విశ్వక్రీడల కోసం భారత్ నుంచి 228 అథ్లెట్స్ బయలుదేరి వెళ్లనున్నారు. ఇప్పటికే ఒలింపిక్స్ తీవ్రంగా కృషి చేస్తున్న భారత అథ్లెట్లతో వీడియో సమావేశం ద్వారా సంభాషించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ.

శిక్షణ ఎలా జరుగుతుంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? తదితర విషయాల గురించి ఒక్కో అథ్లెట్‌ని ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. అథ్లెట్లతో పాటు వారి తల్లిదండ్రులతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు ప్రధాని నరేంద్రమోదీ...
తొలుత ఆర్చర్ దీపికా కుమారి, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడిన మోదీ... నెం.1 ఆర్చర్‌గా మారిన ఆమెకు అభినందనలు తెలిపారు. ‘పారిస్‌లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన తర్వాత మీ గురించి దేశమంతా మాట్లాడుకుంటోంది. మీపైన భారీ అంచనాలు ఉన్నాయి...’ అన్నారు మోదీ. దానికి ‘నాపైన నాకు కూడా భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని అందుకునేందుకు ప్రయత్నిస్తా’నని చెప్పింది.

కామన్వెల్త్‌లో స్వర్ణం సాధించిన జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా... భారత ఆర్మీలో చేరాలనేది తన చిన్ననాటి కల అని. జావెలిన్ త్రో ఆడడం మొదలెట్టిన తర్వాత ఆర్మీలో చేరాల్సిందిగా పిలుపు వచ్చిందని తెలిపాడు.
ఆరుసార్లు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన బాక్సర్ మేరీకోమ్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ... ‘మిమ్మల్ని చూసి దేశమంతా గర్వపడుతోంది. ఒలింపిక్‌కి వెళ్లే ప్రతీ అథ్లెట్‌కి మీరు ఆదర్శం... ఒలింపిక్‌లో పతకం గెలవడం మీ కల అని చెప్పారు. అది మీ కల మాత్రమే కాదు, దేశం మొత్తానికి. టోక్యోలో మీరు స్వర్ణం గెలవాలని యావత్ భారతం కోరుకుంటోంది...’ అని తెలిపారు.
సానియా మీర్జా విజయం తర్వాత భారత్‌లో పిల్లలు టెన్నిస్ చూడడం, ఆడడం నేర్చుకున్నారని చెప్పిన ప్రధాని మోదీ, క్రికెట్ కాకుండా మరో క్రీడకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని యంగ్‌స్టర్స్‌లో నమ్మకం తెచ్చారని అన్నారు. యంగ్ టెన్నిస్ ప్లేయర్ అంకితా రైనాతో కలిసి ఒలింపిక్స్‌ ఆడబోతుండడంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపింది సానియా మీర్జా...
షూటర్ ఎలవెనిల్ వాలివరణ్‌తో పాటు స్ప్రింటర్ ద్యూటీ చంద్, రెజ్లర్ వినేశ్ ఫోగట్, తదితరులతో ముచ్చటించిన ప్రధాని మోదీ, ఒలింపిక్స్‌లో పతకం గెలిచి భారత పతకాన్ని రెపరెపలాడించాలని ఆకాంక్షించారు...

Latest Videos

click me!