పర్దీప్ నర్వాల్‌కి రికార్డు ధర... ప్రొ-కబడ్డీ వేలంలో రాహుల్ చౌదరీకి నిరాశ...

First Published | Aug 31, 2021, 10:31 AM IST

ప్రొ కబడ్డీ లీగ్ సీజన్8 వేలంలో స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్ అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఆరంభంతో పోలిస్తే ప్రస్తుతం ప్రొ కబడ్డీ లీగ్‌కి ఆదరణ తగ్గింది. దీంతో పాటు కరోనా లాక్‌డౌన్ కారణంగా గత ఏడాది టోర్నీ నిర్వహించలేదు...

ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్ 8 వేలంలో పర్దీప్ నర్వాల్‌ను రూ.1.65 కోట్ల భారీ ధర చెల్లించి మరీ కొనుగోలు చేసింది యూపీ యోధ... 

బేస్ ప్రైజ్ రూ.30 లక్షలతో వేలానికి వచ్చిన పర్దీప్ నర్వాల్, కబడ్డీ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...


సిద్ధార్థ్ దేశాయ్‌ను రూ.1.30 కోట్లకు అట్టిపెట్టుకున్న తెలుగు టైటాన్స్... ఆరంభంలో తెలుగు టైటాన్స్ తరుపున అదరగొట్టిన రైడర్ రాహుల్ చౌదరీని మాత్రం పట్టించుకోలేదు...

రాహుల్ చౌదరి బేస్ ప్రైజ్ రూ.30 లక్షలతో వేలానికి రాగా, కేవలం రూ.40 లక్షలకు అతన్ని సొంతం చేసుకుంది పుణెరి పల్టన్... గత సీజన్‌ వేలంలో రాహుల్ చౌదరి రూ.1.29 కోట్ల ధర పలకడం విశేషం...

మంజీత్‌ను తమిళ్ తలైవాస్ రూ.92 లక్షలకు దక్కించుకోగా... పట్నా పైరెట్స్, సచిన్‌ కోసం రూ.84 లక్షలు చెల్లించేందుకు సిద్ధమైంది...

రోహిత్ గులియాను రూ.83 లక్షలకు హరియాణా స్టీలర్స్, సుర్జీత్ సింగ్‌ను రూ.75 లక్షలకు తమిళ్ తలైవాస్ దక్కించుకున్నాయి...

అలాగే గుజరాత్ జెయింట్స్ జట్టు రవిందర్ పహల్ కోసం రూ.74 లక్షలు చెల్లించడానికి సిద్ధపడగా, పుణెరి పల్టన్ జట్టు, విశాల్ భరద్వాజ్ కోసం రూ.60 లక్షలు, జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు దీపక్ హుడాను రూ.55 లక్షలకు కొనుగోలు చేసింది...

సందీప్ కుమార్‌ ధుల్‌ను జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు రూ.50 లక్షలకు కొనుగోలు చేయగా.. మిగిలిన ప్లేయర్ల కోస నేడు కూడా వేలంపాట కొనసాగనుంది...

Latest Videos

click me!