వాస్తవానికి ఒలింపిక్స్ ఆరంభ, ముగింపు వేడుకలు ఎలా జరిగినా, పతక ప్రదాన వేడుకలను ఎంతో ఆర్భాటంగా నిర్వహించేవాళ్లు. ఎన్నోఇబ్బందులకు ఎదురొడ్డి, అవాంతరాలను అధిగమించి, ప్రత్యర్థులను ఓడించి విజయం సాధించినవారి కష్టానికి,కృషికి గౌరవంగా ఈ వేడుకలు జరిగేవి.
undefined
గత ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన విజేతలు కానీ, లేక సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, లేదా ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు... విజేతలకు పతకాలను అందించేవాళ్లు...
undefined
అయితే కరోనా ఆంక్షల కారణంగా ఈ వేడుకలపై కూడా నిషేధం విధించింది ఐఓసీ. ప్రోటోకాల్ ప్రకారం మెడలో వేయకుండా, గెలిచిన వారికి ఓ ప్లేట్‌లో పెట్టి పతకాలను అందిస్తారు. ఎవరి మెడలో వాళ్లు పతకాలను వేసుకోవాల్సి ఉంటుంది..
undefined
దాదాపు 12 వేల మంది క్రీడాకారులు పాల్గొనే టోక్యో ఒలింపిక్స్‌లో ఎవరైనా పాజిటివ్‌గా నిర్ధారణ అయితే టీమ్ ఈవెంట్స్ అయితే ఆ అథ్లెట్ స్థానంలో మరొకరిని ఆడించేందుకు అవకాశం కల్పించారు నిర్వహాకులు...
undefined
అదే సింగిల్ ఈవెంట్స్ అయితే సదరు వ్యక్తిని పోటీల్లో పాల్గొనకుండా నిషేధించారు. అతను పార్టిసిపేట్ చేయకుండానే తప్పుకున్నట్టుగా ‘డు నాట్ స్టార్ట్ - DNS’ అని టిక్ పెడతారు...
undefined
పోటీలు ముగిసిన తర్వాత ఏడుచుకుంటూ కౌగిలించుకోవడాలు, ఓదార్పులు, చేతులు కలిపి అభినందనలు తెలుపుకోవడాలు సహజం. అయితే ఈసారి అవన్నీ నిషేధించింది ఒలింపిక్స్ కమిటీ. టోక్యోలో ఎమర్జెన్సీ అమలులో ఉన్న కారణంగా కరోనా ప్రోటోకాల్స్ తప్పనిసరిగా ఫాలో కావాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.
undefined