ఒలింపిక్స్‌లో మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ వుమెన్... వెయిట్ లిఫ్టింగ్‌లో...

First Published | Aug 2, 2021, 7:26 PM IST

టోక్యో ఒలింపిక్స్‌లో న్యూజిలాండ్ వెయిట్ లిఫ్టర్ లారెల్ హబర్డ్ చరిత్ర క్రియేట్ చేసింది. ఒలింపిక్స్ గేమ్స్‌లో పాల్గొంటున్న మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ వుమెన్‌గా నిలిచింది హబర్ట్. 

+87 కేజీల విబాగంలో పోటీపడిన లారెల్ హబర్ట్, మూడు ప్రయత్నాల్లోనూ 120 కేజీలను లిఫ్ట్ చేయడంలో విఫలమై, నిరాశగా ఒలింపిక్స్ నుంచి వెనుదిరిగింది.

43 ఏళ్ల లారెల్ హబర్ట్, పుట్టుకతో మగవాడు. 30 ఏళ్ల వయసులో లింగమార్పిడి చేసుకుని మహిళగా మారాడు. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ, ట్రాన్స్‌జెండర్లకు కూడా అనుమతి ఇవ్వడంతో విశ్వక్రీడల్లోకి ఎంట్రీ ఇచ్చాడు హబర్ట్.


2017 వరల్డ్ ఛాంపియన్స్‌షిప్స్‌లో రజతం గెలిచిన హబర్ట్, 2018 కామ్వనెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌గానూ రికార్డు నెలకొల్పింది...

అయితే పుట్టుకతో మగవాడైన హబర్ట్‌, మహిళల విభాగంలో పోటీపడడంపై వుమెన్ అథ్లెట్లు అభ్యంతరం తెలిపారు. 

లింగమార్పిడి చేసుకున్నా, అతనికి శారీరకంగా అడ్వాంటేజ్ ఉంటుందని వాదించారు. అయితే ఆ విమర్శలన్నింటినీ దాటుకుని విశ్వక్రీడల్లో పాల్గొన్న లారెల్ హబర్ట్, పథకం మాత్రం గెలవలేకపోయింది...

పురుషుల విభాగంలో పోటీ పడి పతకం గెలవలేక, లింగ మార్పడి చేసుకున్న లారెల్ హబర్ట్... టోక్యో ఒలింపిక్స్ తర్వాత మహిళల విభాగంలోనూ మెడల్ సాధించలేనని తెలుసుకుని ఉంటాడని తీవ్రంగా విమర్శిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు..

Latest Videos

click me!