ఇన్నాళ్ల బోల్ట్ ఆధిపత్యాన్ని బద్దలుకొట్టిన నీరజ్ చోప్రా.. ఆ విషయంలో గోల్డెన్ బాయ్‌దే రికార్డు

First Published | Dec 17, 2022, 3:49 PM IST

Neeraj Chopra: గతేడాది ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన తర్వాత నీరజ్..  ఈ ఏడాది వరల్డ్ ఛాంపియన్షిప్ లో రన్నరప్ గా నిలిచాడు. ఈ  జాబితాలో అంజూ బాబీ జార్జ్ తర్వాత  పతకం సాధించిన ఆటగాళ్లలో నీరజ్ రెండోవాడు.. 

గతేడాది  టోక్యోలో ముగిసిన  ఒలింపిక్స్ లో భాగంగా జావెలిన్ త్రోలో  స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా తాజాగా మరో రికార్డు  కొట్టాడు.  ట్రాక్ అండ్ ఫీల్డ్ లో  వందలాది రికార్డులు తన పేరిట లిఖించుకున్న  ప్రపంచ స్థాయి మాజీ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ రికార్డును  బ్రేక్ చేశాడు.  
 

అదేంటి..? బోల్ట్  ఆడింది  రన్నింగ్ రేస్ లలో. కానీ నీరజ్ ఆడేది జావెలిన్ త్రో.  ఈ ఇద్దరూ ఒకరిని ఒకరు బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఏముంటాయి..? అనేగా మీ అనుమానం.  అయితే  చోప్రా బ్రేక్ చేసిన రికార్డు.. బోల్డ్ ఆటకు సంబంధించినది కాదు. పాపులారిటీలో.. 


ఒక ఏడాదిలో అత్యధిక ఆర్టికల్స్ రాసిన  క్రీడాకారుల (ట్రాక్ అండ్ ఫీల్డ్ లో) జాబితాలో బోల్డ్ గత కొన్నేళ్లుగా ఆధిక్యాన్ని ప్రదర్శించాడు.  అయితే ఈ ఏడాది చోప్రా.. బోల్డ్ ను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని అందుకున్నాడు. 

మీడియా విశ్లేషణ సంస్థ  యూని సెప్టా వరల్డ్ అథ్లెటిక్స్  ప్రకారం.. 2022లో  నీరజ్ చోప్రాపై 812 ఆర్టికల్స్  రాయగా   బోల్ట్ పై 574 ఆర్టికల్స్ వెలువడ్డాయి. ఈ విషయంలో  జమైకన్ ఎలైన్ థాంప్సన్, హెరా (751 ఆర్టికల్స్), మహిళల వంద మీటర్ల వరల్డ్ ఛాంపియన్  షెల్లీ అని ఫ్రేసర్  (698), ఉమెన్స్ 200 మీటర్ల  ఛాంపియన్ షెరికా జాక్సన్  పై 679 ఆర్టికల్స్ వెలువడ్డాయని నివేదికలో పేర్కొన్నారు. 

ఇదే విషయమై వరల్డ్ అథ్లెటిక్స్ అధ్యక్షుడు  సెబాస్టియన్ కోయ్ మాట్లాడుతూ.. ‘అవును చాలా కాలం  ఉసేన్ బోల్ట్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాుడ. కానీ  చాలా కాలం తర్వాత   ఈ ఏడాది ఆ స్థానాన్ని   నీరజ్ ఆక్రమించాడు.  ఇది చాలా ఆసక్తికరమైన విషయం.  అథ్లెట్ల  గురించి రాసిన ఆర్టికల్స్ లో ఈసారి   బోల్ట్  నాయకత్వం వహించలేదు.  అథ్లెట్లు తమ గేమ్ లో అగ్రస్థానంలో ఉండటానికి చేస్తున్న కృషిని తెలియజేస్తున్నది.  వారి ప్రయత్నాల ద్వారా  అథ్లెటిక్స్ నిజంగా ప్రజాధరణ పొందుతున్నాయి..’ అని తెలిపారు. 
 

గతేడాది ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన తర్వాత నీరజ్..  ఈ ఏడాది వరల్డ్ ఛాంపియన్షిప్ లో రన్నరప్ గా నిలిచాడు. ఈ  జాబితాలో అంజూ బాబీ జార్జ్ తర్వాత  పతకం సాధించిన ఆటగాళ్లలో నీరజ్ రెండోవాడు.  వరల్డ్ ఛాంపియన్ తో పాటు మరికొన్ని  టోర్నీలలో నీరజ్ రాణించాడు.  కానీ తొడల గాయం కారణంగా కామన్వెల్త్ క్రీడలకు వెళ్లేలేకపోయాడు. 

Latest Videos

click me!