ఒలింపిక్ విజయం తర్వాత తనకి పిజ్జా అంటే చాలా ఇష్టమని, అయితే పోటీల కోసం ప్రీపేర్ అయ్యేందుకు చాలాకాలంగా పిజ్జా తినలేకపోయానని... ఇప్పుడు తాను వెంటనే పిజ్జా తింటానని చెప్పుకొచ్చింది మీరాభాయ్ ఛాను...
ఒలింపిక్ విజయం తర్వాత దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మీరాభాయ్ ఛానుకి జీవితకాలం ఫ్రీ పిజ్జాను ఆఫర్ చేసింది డొమినోస్ ఇండియా. ఈ రకంగా ఫ్రీ పిజ్జాల ఖర్చుతో బీభత్సమైన ఫ్రీ పబ్లిసిటీ కూడా చేసుకుంది డోమినోస్...
మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరాభాయ్ ఛానుపై వరాల జల్లు కురిపించింది. స్పోర్ట్స్ కోటాలో భారత రైల్వే శాఖలో టికెట్ కలెక్టర్‌గా ఉద్యోగం సంపాదించిన మీరాభాయ్ ఛానుకి ఓ ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది మణిపూర్ ప్రభుత్వం...
ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఓ రజతం సాధించిన స్ప్రింటర్ హిమాదాస్‌కి అస్పాం ప్రభుత్వం డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీసుగా పోస్టు ఇచ్చింది. మీరాభాయ్‌కి కూడా అలాంటి ఓ ఉన్నత పదవిని ఇచ్చేందుకు మణిఫూర్ ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
అనేక ఆర్థిక కష్టాలకు ఎదురొడ్డి, ప్రపంచవేదికపై భారత పతకాన్ని రెపరెపలాడించిన మీరాభాయ్ ఛానుకి తక్షణ సాయంగా రూ. కోటి రివార్డును కూడా ప్రకటించారు మణిపూర్ సీఎం..
‘మీరు ఇంకా రైళ్లలో టికెట్ కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకోసం ఓ స్పెషల్ పోస్టు ఎదురు చూస్తోంది...’ అంటూ మీరాభాయ్ ఛానుకి వీడియో సమావేశంలో తెలియచేశారు మణిపూర్ సీఎంసింగ్...
2000వ సంవత్సరంలో వెయిట్ లిఫ్టింగ్‌లో పతకం సాధించిన తెలుగమ్మాయి కరణం మల్లీశ్వరి తర్వాత ఒలింపిక్ మెడల్ సాధించిన భారత వెయిట్ లిఫ్టర్‌గా నిలిచిన మీరాభాయ్ ఛాను... రజతం సాధించిన మొదటి భారత వెయిట్ లిఫ్టర్‌గా రికార్డు క్రియేట్ చేసింది.