ఫిఫా వరల్డ్ కప్ 2022 ప్రసారాల్లో జియో అట్టర్‌ఫ్లాప్... ఐపీఎల్‌‌కి కూడా ఇదే గతా! ఫ్యాన్స్ ఆందోళన...

First Published | Nov 21, 2022, 3:47 PM IST

ప్రపంచమంతా ఫిఫా ఫివర్ మొదలైపోయింది. ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ మ్యాచులను వీక్షిస్తూ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఉర్రూతలూగుతున్నారు. అయితే భారత్‌లో మాత్రం ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కి ఈ విషయంలో నిరాశే ఎదురవుతోంది. కారణం ఇండియాలో ఫుట్‌బాల్ మ్యాచులు లైవ్ చూడడానికి సరైన యాప్ అందుబాటులో లేకపోవడమే...

Jio Cenima-World Cup Football

ఇండియాలో ఫిఫా వరల్డ్ కప్ 2022 ప్రత్యేక్ష ప్రసార హక్కులను వయాకాం 18 సొంతం చేసుకుంది. రిలయెన్స్ సంస్థకి చెందిన వయాకాం 18, వూట్ యాప్‌తో పాటు జియో సినిమా యాప్‌లో ఫుట్‌బాల్ మ్యాచులను ప్రత్యేక్ష ప్రసారం చేస్తోంది. వూట్ యాప్‌లో లైవ్ చూడాలంటే రూ.599లతో సబ్‌స్కిప్షన్ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది...

జియో సినిమా యాప్‌లో మాత్రం ఉచితంగా ఫుట్‌బాల్ మ్యాచులు చూడొచ్చు. అయితే ఈ యాప్‌లో లైవ్ చూద్దామని ప్రయత్నించిన అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. 2005లో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో 1జీబీ మూవీ చూసిన దానికంటే ఘోరంగా ప్రతీ సెకనుకి వీడియో ఆగిపోతే... లోడ్ అవుతూ వస్తోంది...


fifa world cup

ఫిఫా వరల్డ్ కప్‌లో మొదటి గోల్ ఎలా చేసింది కూడా సరిగ్గా చూడలేకపోయారు ఫుట్‌బాల్ ఫ్యాన్స్. ఈక్వెడార్ కెప్టెన్ ఎన్నెర్ బంతి దగ్గరికి రాగానే ఆగిపోయిన లైవ్ స్ట్రీమింగ్... ఐదు సెకన్ల తర్వాత లోడ్ అయ్యింది. స్కోరు బోర్డులో గోల్ చేరింది కానీ అలా ఎలా వచ్చింది మాత్రం జియో సినిమాలో మ్యాచ్ చూసే ప్రేక్షకులకు కనిపించలేదు... 

ఇలా లోడ్ అవుతూ సగం సగం మ్యాచులు చూడడం కంటే అస్సలు మ్యాచులు చూడకపోవడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చేశారు ఫుట్‌బాల్ ఫ్యాన్స్. ఇప్పటికే జియో సినిమా యాప్‌కి ఫిఫా వరల్డ్ కప్ కారణంగా నెగిటివ్ రేటింగ్ పడుతోంది. ఫిఫా సంగతి ఎలాగున్నా ఐపీఎల్ 2023 ప్రసార హక్కులను కూడా వయాకాం18యే దక్కించుకుంది..

ఐపీఎల్ 2023 సమయానికి జియో ఓ ప్రత్యేక ఓటీటీ యాప్‌ని తీసుకురాబోతుందని ప్రచారం జరిగింది. కొత్త ఓటీటీ యాప్‌ మార్కెటింగ్ కోసమే జియో వేల కోట్లు ఖర్చు పెట్టి ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకుందని మార్కెట్ వర్గాలు విశ్లేషించాయి. అయితే మరో నాలుగు నెలల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతున్నా... ఇప్పటిదాకా కొత్త ఓటీటీ యాప్ గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు జియో...

IPL 2023 Retentions & Releases

వచ్చే నెల జరిగే మినీ వేలాన్ని జియో సినిమా యాప్‌లో ప్రత్యేక్ష ప్రసారం చేయబోతున్నారు. చూస్తుంటే ఐపీఎల్ 2023 ప్రసారాలు కూడా ఈ వూట్, జియో సినిమా యాపుల్లోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫిఫా వరల్డ్ కప్ ప్రసారాల్లో డిజాస్టర్‌గా మారిన జియో... ఐపీఎల్‌ ప్రసారాల్లో తేడా చేస్తే మాత్రం అది ఆ కంపెనీ గుడ్‌విల్‌నే దెబ్బతీసే ప్రమాదం ఉంది...

IPL Fans

ఇండియాలో బిగ్గెస్ట్ కార్పొరేట్ దిగ్గజ కంపెనీల్లో ఒక్కటైన రిలయెన్స్, ఇప్పటికైనా ఈ యాప్‌ల విషయంలో శ్రద్ధ పెట్టాలి... ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కి కలిగిన ఇబ్బంది, ఐపీఎల్ అభిమానులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. తేడా వస్తే... ఇండియాలో ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఉన్నంత సైలెంట్‌గా క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఉండరు..  

Latest Videos

click me!