పెళ్లై ఏడాదైనా భార్యకు దూరంగా ఉంటూ... కామన్వెల్త్ మెడల్ గెలిచేందుకు గురురాజ పూజారి...

First Published | Aug 1, 2022, 4:47 PM IST

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కి పతకాల పంట పండిస్తున్నారు వెయిట్‌లిఫ్టర్లు. అనేక కష్టాలకు ఎదురొడ్డి ప్రపంచవేదికపైగా భారత త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడిస్తున్నారు. భారత్‌కి పతకం అందించిన విజేతల స్ఫూర్తిదాయక కథనాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.. 

sanket sargar

ఒలింపిక్ మెడలిస్ట్ మీరాబాయి ఛాను గోల్డ్ మెడల్ గెలవగా పురుష వెయిట్ లిఫ్టర్ సంకేత్ సర్గర్ రజతం గెలిచాడు. గురురాజ పూజారి కాంస్యం గెలవగా మరో మహిళా వెయిట్‌లిఫ్టర్ బింద్యారాణి దేవి రజతం గెలిచింది. 

Image credit: Getty

67 కేజీల మెన్స్ వెయిట్‌లిఫ్టింగ్ ఫైనల్‌లో భారత వెయిట్‌లిఫ్టర్, 19 ఏళ్ల జెరెమీ లాల్రిన్నుంగా, తన ఏకంగా 300 కేజీలు ఎత్తి... భారత్‌కి రెండో స్వర్ణం అందించాడు. మూడో రోజు వెయిట్ లిఫ్టింగ్ పురుషుల 73 కిలోల విభాగంలో అచింత షెవులి మూడో స్వర్ణం అందించాడు. ఇప్పటిదాకా భారత్‌కి ఆరు పతకాలు రాగా అన్నీ కూడా వెయిట్‌లిఫ్టర్లు అందించినవే...
 

Latest Videos


gururaja

61 కేజీల విభాగంలో 269 కిలోలు ఎత్తి, భారత్‌కి కాంస్య పతకం అందించిన గురురాజ పూజారి గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటికి వచ్చింది. కర్ణాటకలోని మంగళూరు ఏరియాకు చెందిన గురురాజ పూజారికి 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో 56 కేజీల విభాగంలో పోటీపడి రజతం గెలిచాడు...

బర్మింగ్‌హమ్ కామన్వెల్త్‌లో కాంస్య గెలిచిన తర్వాత తన పతకాన్ని ఆయన భార్య సౌజన్యకి అంకితమిచ్చాడు గురురాజ పూజారి. ‘నేను ఈ మెడల్‌ని నా భార్యకి అంకితమిస్తున్నా. మాకు గత ఏడాది పెళ్లైంది. అయితే అప్పటి నుంచి క్యాంపులు, ట్రైనియింగ్ కారణంగా ఆమెకు దూరంగా ఉండాల్సి వచ్చింది...

ఆమె కూడా ఈ సమయంలో నాకు ఎంతగానో సహకరించింది. ఈ విజయం ఆమెకే అంకితం. నాకు అన్ని విధాలా సహకరించిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి కూడా థ్యాంక్స్...
 

ఈ పతకం నాకెంతో సంతోషాన్నిచ్చింది. ఎందుకంటే నేను సరైన ట్రైయినింగ్ తీసుకోలేదు. జ్వరంతో కాళ్లు, మోచేతికి గాయమై తీవ్రమైన నొప్పితో బాధపడ్డాను. అయినా గెలిచినంటే నా కష్టానికి తగిన ఫలితం దక్కినట్టే’ అంటూ చెప్పుకొచ్చాడు గురురాజ పూజారి.. 

స్నాచ్ రౌండ్‌లో 118 కేజీలు ఎత్తిన భారత వెయిట్‌లిఫ్టర్ గురురాజ పూజారి, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో 153 కేజీలు ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు. 

click me!