అడుగు పెట్టిన ప్రతీ చోట జెండా పాతేశాడు... ఇండియన్ గ్రేటెస్ట్ అథ్లెట్‌గా నీరజ్ చోప్రా...

First Published | Jul 24, 2022, 12:05 PM IST

నీరజ్ చోప్రా... ఇప్పుడు భారత క్రీడా ప్రపంచంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు... టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి క్రేజ్ దక్కించుకున్న జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా... తాజాగా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం సాధించాడు... ఈ విజయంతో అథ్లెటిక్స్ అన్ని పోటీలోన్నో పతకం గెలిచిన భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు నీరజ్ చోప్రా...

neeraj chopra

వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2022లో 88.13 మీటర్ల దూరాన్ని సంధించిన నీరజ్ చోప్రా, రెండో స్థానంలో నిలిచి రజతం సాధించాడు. 90.46 మీటర్లు విసిరిన వరల్డ్ నెం.1 జావెలిన్ త్రోయర్ అండర్సన్ పీటర్స్ స్వర్ణం గెలిచాడు...

2013 వరల్డ్ యూత్ ఛాంపియన్‌షిప్స్‌లో కెరీర్ మొదలెట్టిన నీరజ్ చోప్రా, తన తొలి అంతర్జాతీయ టోర్నీలో 66.75 మీటర్లు విసిరి 19వ స్థానానికి పరిమితమయ్యాడు. 2015లో జరిగిన ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో 70.50 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా... 9వ స్థానానికి పరిమితమయ్యాడు...


2016 నుంచి నీరజ్ చోప్రా కెరీర్‌లో ‘స్వర్ణ’ యుగం మొదలైంది. గౌహతిలో జరిగిన సౌత్ ఏషియన్ గేమ్స్‌లో 82.23 మీటర్లు విసిరి స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా.. అదే ఏడాది వియత్నాంలో జరిగిన ఏషియన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 77.60 మీటర్లు విసిరి రజతం సాధించాడు...

పోలాండ్‌లో జరిగిన 2016 వరల్డ్ అథ్లెటిక్స్ అండర్20 ఛాంపియన్‌షిప్స్‌లో 86.48 విసిరి, స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా... వరల్డ్ జూనియర్ అథ్లెటిక్స్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు...

2017లో చైనాలో జరిగిన ఏషియాన్ గ్రాండ్ ప్రిక్స్ సిరీస్‌లో రెండు రజతాలు గెలిచిన నీరజ్ చోప్రా, ఓ కాంస్య పతకం గెలిచాడు.అదే ఏడాది ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో 85.23 మీటర్లు విసిరి స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా... ఫ్రాన్స్‌ల జరిగిన డైమండ్ లీగ్‌లో 7,15 స్థానాల్లో నిలిచి తీవ్రంగా నిరాశపరిచాడు...

neeraj chopra

అయితే ఆ తర్వాతి ఏడాది ఆఫెన్‌బర్గ్ స్పీర్‌వుర్ఫ్ మీటింగ్‌లో రజతం గెలిచిన నీరజ్ చోప్రా, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో 86.47 మీటర్లు విసిరి స్వర్ణం సాధించాడు. అదే ఏడాది డైమండ్ లీగ్‌లో 87.43 మీటర్లు విసిరినా నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం మిస్ అయ్యాడు...

ఫ్రాన్స్‌లో జరిగిన సొట్టెవిల్లే అథ్లెటిక్స్ మీట్‌లో, ఫిన్‌లాండ్‌లో జరిగిన సావో గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా, ఏసియాన్ గేమ్స్ 2018లో 88.06 మీటర్లు విసిరి సరికొత్త రికార్డులతో స్వర్ణం గెలిచాడు...
 

Image credit: PTI

2020 ఒలింపిక్స్‌కి అర్హత పోటీలుగా సౌతాఫ్రికాలో జరిగిన అథ్లెటిక్స్ సెంట్రల్ నార్త్ వెస్ట్ లీగ్ మీటింగ్‌లో స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా, పోర్చుగల్‌లో జరిగిన మీటింగ్ సీడెడ్ డి లిసోబా, స్వీడెన్‌లో జరిగిన ఫోల్క్‌సామ్ గ్రాండ్‌ప్రిక్స్‌లో స్వర్ణం సాధించాడు...

Image Credit: Getty Images

టోక్యో ఒలింపిక్స్ 2020లో 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా... పావో నుర్మి గేమ్స్‌లో 89.30 మీటర్ల దూరం విసిరి కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. అయితే ఈ పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా, ఫిన్‌లాండ్‌లో జరిగిన కోర్టెన్ గేమ్స్‌లో స్వర్ణం సాధించాడు...

రెండు సార్లు మెడల్స్ మిస్ అయిన డైమండ్ లీగ్‌లో 89.94 మీటర్లతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన నీరజ్ చోప్రా... రెండో స్థానంలో రజతం గెలిచాడు. తాజాగా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో పతకంతో అథ్లెటిక్స్‌లో మేజర్ ఈవెంట్స్‌ అన్నింటిలో పతకాలు సాధించిన భారత అథ్లెట్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు నీరజ్ చోప్రా...

Latest Videos

click me!