భారీ అంచనాలతో పతకాల పంట పండిస్తారని భావించిన షూటర్లు, ఆర్చర్లు... టోక్యో ఒలింపిక్స్‌లో తీవ్రంగా నిరాశపరిచాయి. వరల్డ్ నెం.1 షూటర్‌గా టోక్యోలో అడుగుపెట్టిన మను బకర్, పిస్టల్ మాల్‌ఫంక్షన్ కారణంగా ఫైనల్‌కి కూడా చేరలేకపోయింది...
మెన్స్, వుమెన్స్ టీమ్ ఈవెంట్, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లలో తీవ్రంగా నిరాశపరిచిన భారత ఆర్చర్లు... వ్యక్తిగత విభాగంలో మాత్రం కాస్త బెటర్ పర్ఫామెన్సే ఇచ్చారు. భారత మహిళా ఆర్చర్ దీపికా కుమారి, ఆమె భర్త అతానుదాస్ క్వార్టర్ ఫైనల్స్ దాకా వెళ్లగలిగారు...
టేబుల్ టెన్నిస్‌లో తొలిసారి భారత ప్లేయర్లు విజయాలను అందుకున్నారు. వుమెన్ సింగిల్స్‌లో భారత టీటీ ప్లేయర్లు సుత్రీత ముఖర్జీ రెండో రౌండ్‌లో ఓడగా, మానికా బత్రా, మెన్స్ సింగిల్స్‌లో శరత్ కమల్ మూడో రౌండ్‌లోకి ప్రవేశించి రికార్డు క్రియేట్ చేశారు...
ఒలింపిక్స్‌లో మొట్టమొదటి సారిగా భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఫెన్సర్ సీఏ భవానీ దేవీ, తొలి రౌండ్‌లో విజయాన్ని అందుకుంది. మొట్టమొదటి ఒలింపిక్‌లోనే విజయాన్ని అందుకుని, భవిష్యత్తుపై ఆశలు రేపింది భవానీ దేవీ...
టోక్యో ఒలింపిక్స్‌లో భారత గోల్ఫర్ అదితి అశోక్ సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. గోల్ఫ్‌లో నాలుగో స్థానంలో నిలిచి, అద్భుతం చేసింది. గోల్ఫ్‌లో టీమిండియాకి పెద్దగా ఆశలు లేవు. అయితే వ్యక్తిగత స్టోక్ ప్లే ఈవెంట్‌లో మూడు రౌండ్లు ముగిసేవరకూ టాప్ 2లో ఉన్న అదితి అశోక్, యావత్ భారతం దృష్టిని ఆకర్షించింది...
టోక్యో ఒలింపిక్స్‌లో ఈక్వెస్ట్రైయిన్ ఈవెంట్‌లో తొలిసారిగా బరిలో దిగిన భారత అథ్లెట్ ఫౌద్ మీర్జా... ఈక్వెస్ట్రైయిన్ జంపింగ్ ఈవెంట్‌లో ఫైనల్‌కి అర్హత సాధించాడు...
మెన్స్ 4X400 రిలే క్వాలిఫికేషన్స్ రౌండ్‌లో భారత అథ్లెట్స్ మహ్మద్ అనాస్, నిర్మా నోవా, అరోకియా రాజీవ్, అమోజ్ జాకోబ్ 3:00.25 సెకన్లలో ముగించి, ఆసియా రికార్డు క్రియేట్ చేశారు... అయితే హీట్ 2లో నాలుగో స్థానంలో నిలిచిన భారత అథ్లెట్లు, ఫైనల్స్‌కి అర్హత సాధించలేకపోయారు.
టోక్యో ఒలింపిక్స్‌లో 20 కిమీల వాకింగ్ రేసులో భారత అథ్లెట్ సందీప్ కుమార్, ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చాడు. రేసు ఆరంభం నుంచి 8 కి.మీ.ల ముగిసేవరకూ చైనా అథ్లెట్ వాంగ్‌తో కలిసి లీడ్‌లో కనిపించిన సందీప్ కుమార్... 1:25:07 టైంలో రేసును ముగించి, 23వ స్థానంలో నిలిచాడు...
టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ప్రదర్శన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నాలుగు దశాబ్దాలుగా ఒక్క పతకం సాధించలేక, భారత జనాలు మరిచిపోయిన హాకీకి పున:వైభవం తీసుకొచ్చింది టోక్యో. ఓ వైపు ఇంగ్లాండ్, ఇండియా మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నా, భారత జనాలు మొత్తం మహిళల హాకీ మ్యాచ్ చూశారంటే... ఒలింపిక్స్ జనాల్లో ఎంత మార్పు తెచ్చిందో అర్థం చేసుకోవచ్చు...
పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌తో పతకం సాధించగా... మహిళల హాకీ జట్టు పతకం సాధించకపోయినా ప్రశంసనీయమైన పర్ఫామెన్స్ ఇచ్చింది...
భారత ఒలింపిక్స్ ప్రదర్శన గురించి చెబితే బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు గురించి చెప్పాల్సిందే. భారీ అంచనాలతో టోక్యోలో అడుగుపెట్టిన పీవీ సింధు, కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత మహిళా అథ్లెట్‌గా నిలిచింది సింధు...
టోక్యో ఒలింపిక్స్‌లో మనవాళ్ల ప్రదర్శన, భవిష్యత్తుపై ఆశలు రేపుతోంది. ఈసారి ఏడుకి మాత్రమే పరిమితమైనా, ఈ ఒలింపిక్స్ ఇచ్చిన ఉత్సాహం, స్ఫూర్తి... భవిష్యత్ తరాలకు క్రీడలవైపు మళ్లేలా చేయడం ఖాయం...
వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాభాయి ఛాను, బాక్సింగ్‌లో లవ్‌లీనా, బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు సాధించిన విజయాలతో పాటు మేరీకోమ్, భారత మహిళా హాకీ జట్టు అందుకున్న విజయాలు... మహిళల్లో స్ఫూర్తినింపుతాయి. ఇప్పటికే మీరాభాయి విజయాన్ని చూసిన ఓ చిన్నారి, ఆమె స్ఫూర్తితో బరువులు ఎత్తేందుకు ప్రయత్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది...
ఎలా చూసినా కరోనా కేసుల నడుమ సజావుగా సాగుతుందా? లేదా? అని అనేక అనుమానాలు రేపిన టోక్యో ఒలింపిక్స్, భారత్‌కి ఎన్నో మధురానుభూతలనే మిగిల్చాయి. విజయాలు తక్కువే కావచ్చు, కానీ ఆ కొద్ది విజయాలు, 130 కోట్ల భారతీయుల్లో నింపిన స్ఫూర్తి, ధైర్యం అమూల్యమైనది...
టోక్యో ఒలింపిక్స్‌లో ఒక్క స్వర్ణం కోసం ఆఖరి రోజు దాకా వేచి చూడాల్సి వచ్చింది. అయితే లేటుగా వచ్చినా లేటెస్టుగా ఎంట్రీ ఇచ్చిన నీరజ్ చోప్రా... జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. గాయం నుంచి కోలుకుని, నీరజ్ సాధించిన విజయం అద్వితీయమైనది.