యంగ్ టైగర్ యశస్వి రికార్డ్స్ మోత.. 171 పరుగులతో తొలి భారత క్రికెటర్ గా గుర్తింపు...

Published : Jul 15, 2023, 09:35 AM ISTUpdated : Jul 15, 2023, 09:38 AM IST

టీమిండియా యువ కెరటం యశస్వి రికార్డుల మోత ఆగడం లేదు. తాజాగా తొలి టెస్ట్ మ్యాచ్ లోనే  వెస్టిండీస్ పై 171 పరుగులు చేసిన అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. 

PREV
17
యంగ్ టైగర్ యశస్వి రికార్డ్స్ మోత.. 171 పరుగులతో తొలి భారత క్రికెటర్ గా గుర్తింపు...

భారత క్రికెట్ యువ కెరటం యశస్వి జైస్వాల్ రికార్డుల మోత మోగిస్తూ దూసుకుపోతున్నాడు. అరంగేట్రం చేసిన తొలి టెస్ట్ లోనే సెంచరీతో అదరగొట్టి రికార్డులను తన ఖాతాలో వేసుకున్న యశస్వి మరో ఘనతను కూడా సాధించాడు. 

27

తొలి టెస్ట్ మ్యాచ్ లోనే  వెస్టిండీస్ పై 171 పరుగులు చేశాడు. దీంతో విదేశీ పిచ్ మీద అరంగేట్ర టెస్ట్ లోనే 150కిపైగా పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్ గా కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

37

అంతకుముందు సురేష్ రైనా శ్రీలంకపై 120 పరుగులు చేసి ఈ రికార్డును తన పేరిట నెలకొల్పాడు. అది పదేళ్ల కిందట..2013లో  జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు దీన్ని ఎవరూ బీట్ చేయలేకపోయారు.  ఇప్పుడు సురేష్ రైనాను యశస్వి అధిగమించి.. ఎవరూ అందుకోలేనంత స్కోరు సాధించాడు.  

47

అయితే భారత్ నుంచి డెబ్యూ మ్యాచ్లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్ గా ఇప్పటికీ శిఖర్ ధావనే కొనసాగుతున్నాడు.  ఆయన తన డెబ్యు మ్యాచ్లో 187 పరుగులు చేశాడు.

57

అరంగేట్ర మ్యాచ్లో అత్యధిక పరుగులు సాధించిన  వరుసలో  మూడో బ్యాటరీగా  యశస్వి జైస్వాల్  నిలిచాడు. వెస్టిండీస్ పై 171 పరుగులు చేసిన  యశస్వి జైస్వాల్ అత్యధిక స్కోరర్ గా ఉన్నాడు.  

 

67

యశస్వి జైస్వాల్ కంటే ముందు ఆస్ట్రేలియాపై శిఖర్ ధావన్ 187, వెస్టిండీస్ పై రోహిత్ శర్మ 177 పరుగులతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు

77

అయితే శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు ఇద్దరూ భారత పిచ్ లపైనే ఈ అత్యధిక రన్లను సాధించారు. కాగా యశస్వి జైస్వాల్ మాత్రం.. విదేశీ పిచ్ మీద సాధించడం గమనార్హం. విండీస్ తో రెండు టెస్ట్ సిరీస్ లో భారత్ 1-0 ఆదిత్యంలో దూసుకుపోతోంది. విండీస్ పై భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

click me!

Recommended Stories