ఓ రేప్ కేసు, మరో అత్యాచారయత్నం కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న బయటపెట్టాడు ఫ్రెంచ్ ఫుట్‌బాలర్, మాంచెస్టర్ సిటీ క్లబ్ ప్లేయర్ బెంజిమన్ మెండీ షాకింగ్ విషయాలు వెల్లడించాడు..
నాలుగేళ్ల క్రితం అనగా అక్టోబర్ 2020లో ఇంగ్లాండ్‌లో ఉన్న తన ఇంట్లో ఓ యువతిపై బెంజిమన్ అత్యాచారం చేశాడని కేసు నమోదైంది..
Benjamin Mendy
ఓ యువతిని రేప్ చేయడంతో పాటు మరో 29 ఏళ్ల మహిళపై కూడా ఆరేళ్ల క్రితం అత్యాచార యత్నం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు బెంజిమన్. ఈ రెండు ఆరోపణలను కొట్టి పారేసిన బెంజిమన్ మెండీ, తాను ఇప్పటిదాకా 10 వేల మంది అమ్మాయిలతో సెక్స్ చేసినట్టు వ్యాఖ్యానించాడు..
‘చెషైర్‌లో ఉన్న బెంజిమన్ మెండీ ఇంట్లో పార్టీలు, ఫంక్షన్లు జరుగుతూనే ఉంటాయి. ఆ పార్టీలకు అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా చాలామంది వస్తుంటారు. ఆ సమయంలో ఇద్దరు మహిళా అతిథులతో బెంజిమన్ మెండీ, అసభ్యంగా ప్రవర్తించి, వారిని లోబర్చుకోవడానికి ప్రయత్నించాడు..
యూకేలో చదువుకుంటున్న ఓ మహిళా విద్యార్థి, బెంజిమన్ స్నేహితుడితో ప్రేమలో పడింది. ఆమెతో పాటు మరికొందరితో అతను, బెంజిమన్ ఇంటికి వచ్చాడు. ఆ రాత్రంతా వాళ్లు ఫుల్లుగా పార్టీ చేసుకున్నారు..
Benjamin Mendy
ఆ తర్వాతి రోజు ఆమె స్నానం చేసి బయటికి వస్తుండగా బెంజిమన్ వచ్చి, అత్యాచారం చేయబోయాడు. అతని నుంచి ఆమె ఎలాగోలా తప్పించుకుంది. రెండేళ్ల తర్వాత మరో మహిళ, తన స్నేహితులతో బెంజిమన్ ఇంటికి వచ్చింది. పార్టీ తర్వాత మత్తులో ఉన్న ఆమెపై బెంజిమన్ అత్యాచారం చేశాడు..
ఆమెను ఓ బెడ్‌రూమ్‌లో నగ్నంగా బంధించి, తన మొబైల్‌లో వీడియోలు, ఫోటోలు తీశాడు. అంతేకాకుండా ఆమెను మంచానికి కట్టేసి బలవంతంగా అనుభవించాడు...’ అంటూ చెషైర్ కోర్టు న్యాయవాది హేనా కేసీ తెలిపింది..
Image credit: Getty
తనపై వచ్చిన ఆరోపణలన్నీ చాలా ఓపిగ్గా విన్న బెంజిమన్ మెండీ, ‘ఏమో, నాకు గుర్తులేదు కానీ నేను 10 వేల మంది అమ్మాయిలతో సెక్స్ చేశాను. ఎంతమందినని గుర్తుపెట్టుకుంటాను... అయితే ఎవ్వరినీ బలవంతపెట్టలేదు’ అంటూ కామెంట్ చేశాడు.. కేసు విచారణలో ఉంది.