పోర్చుగల్ సాకర్ వీరుడు క్రిస్టియానో రొనాల్డోకు సోమవారం భారీ షాక్ తగిలింది. అతడు ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కారు బుగట్టి వెయ్రోన్ (Bugatti Veyron) ప్రమాదానికి గురైంది. స్పెయిన్ లోని మజోర్క నగరంలో ఈ ప్రమాదం సంభవించింది.
ప్రస్తుతం రొనాల్డో కుటుంబసభ్యులతో కలిపి స్పెయిన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే రొనాల్డో ఉంటున్న విల్లా గేట్ సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన సమయంలో రొనాల్డో కార్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. క్రిస్టియానోకు చెందిన ఓ ఉద్యోగి Bugatti Veyron ను నడుపుకుంటూ వస్తుండగా.. కార్ అదుపుతప్పి అక్కడే ఉన్న గోడను ఢీకొట్టింది. దీంతో కార్ ముందు భాగం బాగా డ్యామేజ్ అయినట్టు తెలుస్తున్నది.
Bugatti Veyronని రొనాల్డో ఎంతో ఇష్టంతో కొనుగోలు చేశాడు. దీని ధర సుమారు రూ. 16 కోట్లకు పైమాటే అని తెలుస్తున్నది. అయితే బుగట్టి.. గోడను ఢీకొట్టిన సమయంలో అక్కడ మరే కార్ గానీ ఇతర వాహనం గానీ లేకపోవడంతో లోపల ఉన్న వ్యక్తి బతికిపోయాడు.
గోడను ఢీకొనడంతో కార్ ముందుభాగం పాడవగా.. డ్రైవర్ కు కూడా కొన్ని గాయాలతో బయటపడ్డట్టు తెలుస్తున్నది. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.