మిల్కా సింగ్: భారత జట్టుకి ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో ఏడు స్వర్ణాలు అందించిన స్ప్రింటర్ మిల్కా సింగ్. 1960లో పాకిస్తాన్‌లో ఓ క్రీడా ఈవెంట్‌కి వెళ్లేందుకు మిల్కా సింగ్ అంగీకరించలేదు. తన తల్లిదండ్రులను అతి దారుణంగా హత్య చేసిన దేశంలో అడుగుపెట్టడం ఇష్టం లేదని చెప్పాడు. అయితే పాక్ స్ప్రింటర్ అబ్దుల్ ఖలీక్‌ని ఓడించాలనే లక్ష్యంతోనే ఈ పోటీల్లో పాల్గొన్న మిల్కా సింగ్, స్వర్ణం గెలిచాడు. మిల్కా సింగ్‌ని అందరూ ‘ఫ్లైయింగ్ సిక్’ అని పిలుస్తారు. వాస్తవానికి ఈ నిక్ నేమ్ ఇచ్చింది అప్పటి పాక్ అధ్యక్షుడు జనరల్ అయూబ్. ‘మిల్కా నువ్వు ఉరకలేదు, ఎగిరాం...’ అంటూ మిల్కా సింగ్‌ని అభినందించాడు అయూబ్. అప్పటి నుంచి మిల్కా సింగ్‌కి ‘ఫ్లైయింగ్ సిక్’ అనే నిక్ నేమ్ వచ్చింది..
పీటీ ఉషా: భారత్‌కి 4 ఆసియా గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్ మెడల్స్ సాధించిన ‘పరుగుల రాణి’ పీటీ ఉషా. భారత ట్రాక్ అండ్ ఫీల్డ్‌కి క్వీన్‌కి పిలవబడిన పీటీ ఉషా, కడు పేదరికంలో జన్మించింది. తినడానికి కూడా తిండి లేని దుర్భల పరిస్థితులను ఎదుర్కొన్న పీటీ ఉషా... కేరళలోని కన్నూర్‌లో స్పోర్ట్స్ స్కూల్‌లో నెలకి రూ.250 స్కాలర్‌షిప్ పొందుతూ శిక్షణ పొంది... ప్రపంచ వేదికపై విజయాలు అందుకుంది...
ప్రకాశ్ పదుకొనే: బ్యాడ్మింటన్ పేరు చెబితే పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ల పేర్లే చెబుతారు చాలామంది. అయితే కొన్ని దశాబ్దాల ముందే బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్, వరల్డ్ కప్, కామన్వెల్త్ గేమ్స్‌లో, ఆసియా గేమ్స్‌లో పతకాలతో భారత బ్యాడ్మింటన్ కీర్తిని దశదిశాలా చాటి చెప్పాడు ప్రకాశ్ పదుకొనే. 1980 స్వీడెన్ ఓపెన్‌లో తన ప్రత్యర్థి రూడీ హర్టోనోతో జరిగిన మ్యాచ్‌లో కావాలని ఓ పాయింట్ ఓడిపోయాడు ప్రకాశ్ పదుకొనే. తనకు గురువులాంటి రూడీని 15-0 తేడాతో ఓడించడం ఇష్టం లేకనే ఓ పాయింట్ ఇచ్చానని మ్యాచ్ అనంతరం తెలియచేశాడు ప్రకాశ్ పదుకొనే...
విశ్వనాథన్ ఆనంద్: చెస్ సామ్రాజ్య చక్రవర్తిగా కీర్తి ఘడించిన ఆనంద్ విశ్వనాథన్, ఐదు సార్లు వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. భారత అత్యున్నత రెండో పురష్కారం పద్మవిభూషణ్ పొందిన మొట్టమొదటి భారత క్రీడాకారుడు ఆనంద్ విశ్వనాథన్. చెస్‌లో ఆయన సాధించిన విజయాల కారణంగా 2007లో విశ్వనాథన్‌కి పద్మవిభూషణ్‌తో సత్కరించింది ప్రభుత్వం...
im vijayan
ఐఎం విజయన్: భారత్‌కీ ఫుట్‌బాల్ ఆట పెద్దగా ఎక్కదని అనుకుంటారు క్రికెట్ ఫ్యాన్స్. అయితే భారత్‌లోనూ ఫుట్‌బాల్ దిగ్గజాలు, వరల్డ్ రికార్డులు క్రియేట్ చేశాడు. భారత మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ ఐఎం విజయన్, 1999 ఎస్‌ఏఎఫ్ గేమ్స్‌లో భూటాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సాధించిన ఓ గోల్, ప్రపంచంలో అత్యంత వేగవంతమైన గోల్స్‌లో ఒకటిగా నిలిచిపోయింది...
మేరీ కోమ్: బాక్సింగ్‌లో ఒలింపిక్స్ మెడల్‌తో పాటు ఆరు సార్లు వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ గెలిచింది మేరీ కోమ్. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మేరీ కోమ్, మణిపూర్ స్టేట్ ఛాంపియన్‌షిప్ గెలిచేవారకూ తండ్రికి ఈ విషయం చెప్పలేదు. పేపర్‌లో కూతురి ఫోటోతో ప్రచురితమైన వార్త చూసిన తర్వాత మేరీ కోమ్ తండ్రికి ఆమె బాక్సింగ్ చేస్తున్న విషయం తెలియలేదు...
ధన్రాజ్ పీలే: భారత హాకీ జట్టుకి కెప్టెన్‌గా 4 ఒలింపిక్స్, 4 వరల్డ్ కప్స్, 4 ఛాంపియన్స్ ట్రోఫీలు ఆడిన ధన్రాజ్ పీలే... తన కెరీర్‌లో ఎన్ని గోల్స్ సాధించింది కచ్చితమైన రికార్డు లేదు. అయితే కొందరు క్రీడా నిపుణులు మాత్రం ధన్రాజ్ పీలే, తన 24 ఏళ్ల కెరీర్‌లో 170 అంతర్జాతీయ గోల్స్ సాధించాడని అంచనా వేశారు...
గీత్ సేథీ: స్నూకర్ ఆట ఎలా ఆడతారో కూడా కొన్ని కోట్ల మంది భారతీయులకు తెలీదు.. అయితే భారత ప్లేయర్ గీత్ సేథీ బిలియార్డ్స్‌లో 1276 బ్రేక్ పాయింట్లు సాధించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నాడు. అలాగే స్నూకర్‌లో 147 బ్రేక్ పాయింట్లు సాధించిన ఏకైక ప్లేయర్‌గానూ నిలిచాడు గీత్ సేథీ...
Dhyan Chand
ధ్యాన్ చంద్: భారత హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ విగ్రహాన్ని ఆస్ట్రేలియాలోని వియాన్నాలో ప్రతిష్టించారు. అయితే ఈ విగ్రహానికి 4 చేతులు, ఆ చేతుల్లో నాలుగు హాకీ స్టిక్స్ ఉంటాయి. ధ్యాన్ చంద్ ఒక్కడూ నలుగురు ప్లేయర్లతో సమానమని, ‘హాకీ మేజీషియన్’కి ఇలా అరుదైన గౌరవం ఇచ్చారు ఆస్ట్రేలియా క్రీడాభిమానులు..
Image credit: PTI
సునీల్ ఛెత్రీ: భారత ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రీకి ఈ మధ్య కాస్త పాపులారిటీ, క్రేజ్ వస్తోంది. అయితే క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీలతో పోలిస్తే ఇక్కడ కూడా ఛెత్రీకి ఉన్న క్రేజ్ తక్కువే. అయితే భారత ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ... ప్రపంచంలో అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన ప్లేయర్లలో ఒకడు. ప్రస్తుతం ఆడుతున్న ప్లేయర్లలో రొనాల్డో 189 మ్యాచుల్లో 117 గోల్స్ సాధించి టాప్‌లో ఉంటే లియోనెల్ మెస్సీ 162 మ్యాచుల్లో 86 గోల్స్ చేసి రెండో స్థానంలో ఉన్నాడు. భారత కెప్టెన్ 129 మ్యాచుల్లోనే 84 గోల్స్ సాధించి మూడో స్థానంలో ఉన్నాడు..