సంసారంలో సీక్రెట్స్.. పార్ట్ నర్ ఇలానే ఉండాలని కోరిక..!

First Published | Apr 22, 2021, 10:28 AM IST

తమ జీవితంలోకి ఇలాంటి వ్యక్తి రావాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే.. ఆ విషయాన్ని తమ మనసులోనే దాచుకుంటారు. 

ఏ బంధంలోనైనా నిజాయితీ, పారదర్శకత చాలా అవసరం. ఒకరి నిర్ణయాలకు మరొకరు గౌరవం ఇస్తూనే.. తమ గుర్తించి జీవిత భాగస్వామికి మొత్తం తెలియాలి. అలా కాకుండా.. లోలోపల అన్నీ దాచేసుకుంటే ఆ బంధం ఎప్పటికైనా అబద్ధంగానే నిలుస్తుంది.
చాలా మంది దంపతులు.. తమ మనసులో ఉండిపోయే కొన్ని కోరికలను అస్సలు బయటపెట్టరు. అయితే.. ఆ కోరికలను రాశి చక్రాల ప్రకారం తెలుసుకోవచ్చు. తమ జీవితంలోకి ఇలాంటి వ్యక్తి రావాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే.. ఆ విషయాన్ని తమ మనసులోనే దాచుకుంటారు. అసలు ఏ రాశివారు ఎలాంటి పార్ట్ నర్ కావాలని మనసులో అనుకుంటారు..?.. వారి మనసులో ఏముందో ఇప్పుడు చూద్దాం..

1.కుంభ రాశి..ఈ రాశివారు తమ జీవిత భాగస్వామి నుంచి స్వేచ్ఛ, స్వతంత్రం కోరుకుంటారు. తమకు నచ్చినట్లుగా ఉండాలని ఆశపడతారు.తమపై తమ లైఫ్ పార్ట్ నర్ నమ్మకం ఉంచాలని కోరుకుంటారు. అలాంటి వ్యక్తి మీ జీవితంలోకి రావాలని కోరుకుంటారు.
2.మేష రాశి..ఈ రాశివారికి నిజాయితీ ఎక్కువ. ఏ విషయం అయినా ముఖం మీదే కొట్టినట్లు చెప్పేస్తారు. అయితే.. అలా చెప్పిన తర్వాత కూడా తమతో వారు కలిసి ఉండాలని భావిస్తుంటారు. అన్ని విషయాలు రియల్ గా ఉండాలని కోరుకుంటారు. తమ నిజాయితీని అమితంగా ఇష్టపడే వ్యక్తే భాగస్వామిగా రావాలని కోరుకుంటారు.
3.కర్కాటక రాశి..ఈ రాశివారు చాలా ప్రేమగా.. దయగా ఉంటారు. ఎదుటివారు కూడా అలానే ఉండాలని కోరుకుంటారు. మీ లైఫ్ పార్ట్ నర్ మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకోవాలని ఆశపడుతుంటారు.
4.మకర రాశి..ఈ రాశివారు తాము ఏదైనా సాధిస్తే.. లేదా.. తమ తెలివితేటలను తమ పార్ట్ నర్ అభినందించాలని కోరుకుంటారు. తమ నుంచి తమ పార్ట్ నర్ చాలా నేర్చుకోవాలని మీరు భావిస్తూ ఉంటారు,
5. మిథున రాశి..మీరు తెలిసో తెలియక ఏవైనా తప్పులు గతంలో చేసి ఉంటే.. ఆ విషయంలో తమకు అండగా తమ పార్ట్ నర్ ఉండాలని కోరుకుంటారట.
6.సింహ రాశి..ఈ రాశివారు ఎప్పుడూ తమ చుట్టుపక్కల వారి నుంచి అటెన్షన్ కోరుకుంటూ ఉంటారు. మీ పార్ట్ నర్ మీకు నచ్చినట్లుగా ఉండాలని కోరుకుంటారు.
7.తుల రాశి..ఈ రాశివారు కేవలం ఒక్కరితోనే నిజమైన, నిజాయితీ బంధాన్ని కోరుకుంటారు. మీరు మిలా ఉండటాన్ని వారు ఇష్టపడాలని మీరు కోరుకుంటారు.
8.మీన రాశి..మీ బంధం ఎప్పుడూ అందంగా, ఆనందంగా ఉండేందుకు మీ పార్ట్ నర్ కృషి చేయాలని భావిస్తుంటారు. మీ ప్రేమను ఎప్పుడూ గౌరవించే వ్యక్తి కావాలని మీరు కోరుకుంటారు.
9. ధనస్సు రాశి..ఈ రాశి వారికి ప్రయాణాలు ఎక్కువగా ఇష్టం. తమతో కలిసి ఎక్కువ దూరం ప్రయాణాలు చేయడానికి ఇష్టపడే వ్యక్తి పార్ట్ నర్ గా రావాలని కోరుకుంటారు.
10.వృశ్చిక రాశి..ఈ రాశివారు ఏ విషయాన్ని త్వరగా బయటపెట్టరు. కాబట్టి.. తమ జీవితంలోకి వచ్చే వ్యక్తి తమపై నమ్మకం ఉంచి.. ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే వ్యక్తి కావాలని కోరుకుంటారు.
11.వృషభ రాశి..ఈ రాశివారికి కొంచెం తొందరపాటు ఎక్కువ. అందరినీ తప్పుగా అర్థం చేసుకుంటారు. తర్వాత అసలు విషయం తెలుసుకొని రియలైజ్ అవుతారు. కాబట్టి.. తాము తొందరపడినా.. తమను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి జీవితంలోకి రావాలని ఈ రాశివారు కోరుకుంటారు.
12. కన్య రాశి..ఈ రాశివారు ప్రతి విషయంలో హై స్టాండర్స్ కోరుకుంటారు. అయితే.. అవి పక్కన వారిని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. అయితే.. తమ జీవితంలోకి వచ్చే వ్యక్తి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా.. తమ మనసుని అర్థం చేసుకునేలా ఉండాలని ఈ రాశివారు కోరుకుంటారు.

Latest Videos

click me!