మీ భర్త మీ నుంచి ఏం వినాలనుకుంటున్నాడో తెలుసా?

First Published | May 4, 2021, 12:24 PM IST

ఇద్దరిమధ్య అనుబంధానికి శృంగారం ఒక్కటే కొలమానం కాదు. ప్రేమ ఒక్కటే సరిపోదు. నా భార్యే కదా, నా భర్తే కదా ఎక్కడికి వెడతారులే అనుకోవడం సరికాదు.  ఎప్పటికప్పుడూ ఒకరిగురించి ఒకరు ఆలోచించాలి. వారి గురించి మీరెంతగా ఇష్టపడుతున్నారో చెబుతుండాలి. ముఖ్యంగా పురుషులు... తమ భార్యల నుంచి కొన్ని వినాలనుకుంటారు...

భార్యభర్తల మధ్య ప్రేమ అనేది ఎల్లప్పుడూ నిత్యనూతనంగా ఉండాలి. తమ మధ్య ఒకరిమీద ఒకరికి ఉన్న ప్రేమ ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండాలి. ప్రేమ తగ్గలేదనే విషయం నిత్యం ధృవీకరిస్తూ ఉండాలి. మీరు ఇప్పటికీ తనని ఎంత గా ప్రేమిస్తున్నారో చెప్పాలి.

ప్రతీ భర్త తన భార్య తనను మాత్రమే ప్రేమించాలనుకుంటాడు. ఆమె మొదటి ప్రేమ తనే అయి ఉండాలని అనుకుంటాడు. దీనివల్ల తనను భార్య నమ్ముతుందని, విశ్వసిస్తుందనే భావన కలుగుతుంది.
ఇద్దరు కలిసి జీవిత ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు.. ఒకరిమీద ఒకరికి ప్రేమ ఎంత ముఖ్యమో నమ్మకమూ అంతే ముఖ్యం. ఏ సమయంలోనైనా తాన వెన్నంటే మీరున్నారనే భరోసా కలిగించాలి. అప్పుడే మీ బంధం మరింత బలపడుతుంది.
మిమ్మల్ని సంతోషంగా ఎలా ఉంచాలో మీ భాగస్వామికి తెలుసు అనే విషయాన్ని గట్టిగా చెప్పండి. మీరు ఆనందంగా ఉన్న విషయాన్ని తన వల్లే అనేది గుర్తించండి. మీ భర్తకు తరచుగా తన వల్లే మీరింత బాగున్నారే సంగతిని తరచుగా చెప్పండి. ఇది అతన్ని మరింతగా ఉత్సాహపరిచి.. ఇంకాస్త సంతోషపెట్టేలా చేస్తుంది.
మీ మొహంలో చిరునవ్వుకు తను కారణం అనే విషయాన్ని పురుషులు బాగా ఇష్టపడతారు. జోకులు వేసి నవ్వించడం మీ భర్తకు వస్తే.. ఆయన సెన్సాఫ్ హ్యూమర్ ను మెచ్చుకోండి.
ఇక పడకగదిలో మిమ్మల్ని మెప్పించడానికి వారెంత కష్టపడ్డా సరే.. తను ఎంత గొప్ప ప్రేమికుడో అతనికి చెప్పండి. తన సాంగత్యాన్ని మీరెంతగా ఆస్వాదిస్తున్నారో చెప్పండి. ఇది మగవాళ్లకు బాగా నచ్చుతుంది.
ఇక పడకగదిలో మిమ్మల్ని మెప్పించడానికి వారెంత కష్టపడ్డా సరే.. తను ఎంత గొప్ప ప్రేమికుడో అతనికి చెప్పండి. తన సాంగత్యాన్ని మీరెంతగా ఆస్వాదిస్తున్నారో చెప్పండి. ఇది మగవాళ్లకు బాగా నచ్చుతుంది.
జీవిత భాగస్వామిని కేవలం భర్తగా మాత్రమే కాకుండా తనను మీరు స్నేహితుడిగా ఫీలవుతున్నారని చెప్పండి. దీనివల్ల మీరు తనతో అన్ని విషయాలూ షేర్ చేసుకుంటారనే నమ్మకం కలుగుతుంది. మీ మీద నమ్మకాన్ని మరింత పెంచి, మీ బంధం బలపడడానికి దోహదం చేస్తుంది.
నేను నీ దాన్ని... ఈ మాట విన్న మీ భాగస్వామి ఇక మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. వినడానికి ఎంతో రొమాంటిక్ గా ఉన్నా ఇది మీ ఇద్దరి మధ్యనున్న అనుబంధాన్ని పట్టిస్తుంది.
మీరు కష్టపడి పనిచేసే తత్వం నాకు చాలా ఇష్టం.. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది.. కుటుంబం విషయంలో మీరు పడే కష్టం నాకు నచ్చింది.. ఇలాంటి మాటలు పురుషుల్లో మరింత సంతోషాన్ని పెంచుతాయి. మీ పట్ల ప్రేమను అధికం చేస్తాయి.

Latest Videos

click me!