అబ్బాయిలు వెంటపడితే అమ్మాయిలు తిట్టుకుంటారు అని అనుకుంటారు కానీ.. అసలు నిజం అది కాదు. తమను ఎవరైనా చూస్తున్నారని తెలిసినా.. తమ వెంట పడుతున్నా.. అమ్మాయిలు లోలోపల ఎంజాయ్ చేస్తారు. వాళ్లను తమ వైపు మరింత ఆకర్షితులవ్వడానికి ఇంకాస్త అందంగా తయారౌతారు.
undefined
అయితే.. అబ్బాయిలను ఆకర్షించాలనే క్రమంలో కొందరు చేసే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. వాటి కారణంగా.. మీ వైపు వారు ఆకర్షితులయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. నిజంగా అబ్బాయిలు మిమ్మల్ని చూసి ఇష్టపడాలంటే.. ఇదిగో ఇలాంటివి మాత్రం చేయకండి.
undefined
నిజమే.. అబ్బాయిలు ఎక్కువగా అందంగా ఉండేవారి పట్ల ఎక్కువగా ఆకర్షితులౌతారు. ముఖ్యంగా డేటింగ్ విషయంలో ఇది కచ్చితంగా ఫాలో అయిపోతారు. దాదాపు లుక్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు... కానీ అమ్మాయిల ఎమోషన్ ని పెద్దగా పట్టించుకోరు. అయితే.. వాళ్లని ఆకర్షించడానికి మీరు కేవలం అందం మీద మాత్రమే ఫోకస్ పెడితే కష్టమని నిపుణులు చెబుతున్నారు.
undefined
మీ అందం వారికి జీవితాంతం ఆకర్షితులు కాలేరు. కేవలం తొలుత ప్రేమలో పడేయడానికి మాత్రమే సహాయపడుతుంది. అదే కనుక మీరు అమితమైన ప్రేమను అందిస్తే.. అందం తగ్గినా.. ప్రేమ అలానే ఉండిపోతుంది. అలాని మిమ్మల్ని అందంగా తయారవ్వొద్దని చెప్పడం లేదు.. అది మీకు ఆనందాన్ని ఇస్తే.. దానిని మీద దృష్టి పెట్టాలి. అయితే.. మీ భర్తను ఆకర్షించే క్రమంలో మాత్రం మీకు ప్రేమ , కేరింగ్ మాత్రమే సహాయపడతాయి అన్న విషయం గుర్తించుకోవాలి.
undefined
చాలా మంది అమ్మాయిలు డబ్బు, అందం ఉన్న వారిని ప్రేమించాలి.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఇవి లేనివాళ్లు ప్రేమిస్తున్నామంటూ వెంటపడినా పెద్దగా పట్టించుకోరు. అయితే.. ఇక్కడ నమ్మకం, నిజాయితీకే ఓటు వేయాలి. అందం మాత్రమే చూస్తే.. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
undefined
అందంగా ఉన్న అబ్బాయి మిమ్మల్ని వాడుకొని వదిలేస్తే అప్పుడు ఏం చేస్తారు. అలా కాకుండా.. నిజంగా ప్రేమను అందించేవారిలో అందం లేకపోయినా.. మిమ్మల్ని జీవితాంతం ఆనందంగా చూసకునే అవకాశం ఉంది. మీరు ఎంచుకునే అబ్బాయిల్లోనూ అందం, స్టేటస్ కాకుండా.. నిజాయితీ, ప్రేమ, కష్టపడే తత్వం ఉన్నవారిని ఎంచుకోవాలి.
undefined
చాలా మంది అమ్మాయిలు.. తమ వెంట చాలా మంది అబ్బాయిలు పడుతున్నారని చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పడం వల్ల తాము ఇష్టపడే అబ్బాయి ఇంకాస్త ఎక్కువ ఫోకస్ తమ మీద పెడతారని భావిస్తారు. అయితే.. ఇది అన్ని సమయాల్లో వర్కౌట్ అవ్వదు. కొందరు అబ్బాయిలకు ఈగో లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. దాని వల్ల మీరు ఇబ్బందిలో పడే ప్రమాదం ఉంది. కాబట్టి.. వారిని మరో యువకుడితో కలిసి రెచ్చగొట్టడం లాంటివి చేయకూడదు.
undefined
దాదాపు అందరు అమ్మాయిలు.. తమ బాయ్ ఫ్రెండ్ లేదా భర్తలను తమ కంట్రోల్ లో ఉంచుకోవాలని చూస్తుంటారు. అంతేకాకుండా తమను ఎప్పుడూ ప్రొటెక్టివ్ గా చూసుకోవాలని అనుకుంటారు. దానికోసం కొందరు చిన్నపిల్లల్లాగా నటిస్తూ ఉంటారు. అయితే.. అది పెద్దగా నచ్చదట. వయసుకొచ్చిన అమ్మాయిలు చిన్నపిల్లలాగా ప్రవర్తించడం అందరు అబ్బాయిలకు నచ్చదు. కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచించేవారినే వారు ఇష్టపడతారట.
undefined
మీ ఇష్టాలనే వారిపై రుద్దకూడదు. ప్రతి ఒక్కరికీ ఒక్కోరకమైన ఇష్టం ఉంటుంది. ఒకసారి మీకు నచ్చినది చేస్తే.. మరోసారి వారికి నచ్చినది చేయనివ్వాలి. అలా చేయడం వల్ల ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది.
undefined
ఇంకొందరేమో.. పూర్తిగా తమ వ్యక్తిత్వాన్ని కోల్పోయి వారి కోసం పూర్తిగా మారిపోతారు. అలా మారడం వల్ల మిమ్మల్ని మీరు కోల్పోయినట్లే లెక్క. కాబట్టి.. మీకు నచ్చినట్లుగా మీరు ఉంటూనే.. వారికి నచ్చేలా మార్చుుకోగలగాలి. అప్పుడు మీకు వాళ్లు ఫిదా అయిపోవడం ఖాయం.
undefined