ప్రేమ బంధంలో, ఆడ-మగ అనుబంధంలో.. సెక్స్ లో పాల్గొనడం ఈ మధ్యకాలంలో చాలా కామన్ గా మారింది. అయితే.. ప్రేమికులుగా ఉన్న సమయంలోనే శృంగారంలో పాల్గొనాలనే ఆసక్తి ఎవరికి ఎక్కువగా ఉంటుంది?
ఈ విషయంలో ఆడవాళ్లు ముందుంటారా? మగవాళ్లు ఎక్కువ ఆసక్తిని చూపుతారా? అంటే.. ఈ ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానం ఇస్తోంది ఒక బ్రిటన్ అధ్యయన సంస్థ.
చాలా నేచురల్ గా అబ్బాయిలే చొరవ చూపుతారు అని అనుకుంటున్నారా..? అయితే కాదంట.
సెక్స్ విషయంలో సహజమైన ఆసక్తిని పక్కన పెట్టి.. ఒక ప్రేమబంధం ఏర్పడ్డాకా, శృంగారం విషయంలో ఆసక్తి ఎవరిలో ఎక్కువగా ఉంటుందంటే.. అది కచ్చితంగా అమ్మాయిల్లోనే అనే సమాధానం వినపడుతోంది.
ఇది బ్రిటన్ కేంద్రంగా జరిపిన అధ్యయనం. కొన్ని వేల మంది యువతీయువకుల అభిప్రాయాలను తీసుకుని ఈ అధ్యయనాన్ని చేశారట. 18 యేళ్ల పై పడ్డవారిని ఎంపిక చేసి ఈ అధ్యయనం జరిగిందని సమాచారం.
మరి ఇందులోని లెక్కలు ఎలా ఉన్నాయంటే.. తమ మనసుకు నచ్చిన పురుషుడితో తనువును పంచుకోవడానికి 59 శాతం మంది మహిళలు సిద్ధంగా ఉన్నారట.
అదే పురుషుల విషయానికి వస్తే ప్రేమ బంధంతో పడక సుఖం వైపు వెళ్లడానికి 41 శాతం మాత్రమే సంసిద్ధం వ్యక్తం చేశారట.
వోచర్ కోడ్స్ ప్రో అనే అధ్యయన సంస్థ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. సహజంగా మగవాళ్లకే శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయానికి విరుద్ధంగా.. ప్రేమ, సాన్నిహిత్యంలో.. సెక్స్ పట్ల ఆడవాళ్లకే ఆసక్తి ఎక్కువ అని ఈ అధ్యయనం చెబుతోంది.