ఈమధ్యకాలంలో వివాహేతర సంబంధాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. హాయిగా సాగిపోతున్న సంసారాల్లోకి మధ్యలో మరో వ్యక్తి దూరుతున్నాడు. అది కాస్త అక్రమ సంబంధాలకు దారి తీస్తోంది.
అక్కడితో ఆగినా కాస్త పర్వాలేదు. కానీ... వారి బంధానికి అడ్గుగా ఉన్నారని కొందరు భార్యలను, మరికొందరు భర్తలను.. ఇంకొందరైతే ఏకంగా కన్న బిడ్డలను చంపేస్తున్నారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి తమిళనాడులో చోటుచేసుకుంది.
భర్తతో విడిపోయిన తర్వాత వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అతనితో శృంగారంలో మునిగి తేలుతుండగా.. డిస్టర్బ్ చేశాడని కన్న కొడుకునే చంపేసింది ఓ మహాతల్లి.
పూర్తి వివరాల్లోకి వెళితే... కోవై కోవిల్ మేడు ప్రాంతంలో నివసిస్తున్న దివ్య (30)కి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే.. కొంతకాలం వారి సంసారం బాగానే సాగింది. తర్వాత దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి.
దీంతో దివ్య తన భర్త నుంచి విడిపోయి తన ఇద్దరు పిల్లలతో తుడియలూరులో నివాసముంటోంది. కొద్ది రోజులకు అదే ప్రాంతానికి చెందిన రాజదురైతో వివాహేతర సంబంధం ఏర్పడింది.
దీంతో వీరు ఇరువై రోజుల క్రితం సాయిబాబా కాలనీకి నివాసం మార్చారు. రోజూ కామక్రీడలో మునిగితేలేవారు.
అయితే.. వారి ఏకాంతానికి తరచూ దివ్య కుమారుడు అభిషేక్ (6)అడ్డుగా ఉండేవాడు. దీంతో.. దివ్య ప్రియుడి మోజులో పడి కన్న పేగు తీపిని మరిచిపోయింది.
ప్రియుడి సలహాతో అభిషేక్ ని చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది. కాగా.. వీరి చిత్రహింసలను బాలుడు తట్టుకోలేకపోయాడు.
తీవ్రంగా గాయపడిన అతన్ని 108 వాహనం ద్వారా ఇటీవల ఆస్పత్రికి తరలించారు. అయితే వారి తీరుపై అనుమానం రావడంతో 108 సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో దివ్య, రాజదురై గుట్టు రట్టైంది. విచారణలో అభిషేక్ తనని తండ్రిగా అంగీకరించలేదని, తమ ఏకాంతానికి అడ్డుగా ఉన్నాడని అందుకే దివ్యతో కలిసి హతమార్చినట్లు రాజదురై అంగీకరించాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు. మూడేళ్ల కుమార్తెను శిశు సంక్షణ కేంద్రానికి పంపించారు.