ప్రపంచంలో చాలా వింతలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఇప్పటికే మనం 10ఏళ్ల పిల్లాడు.. తండ్రి అయ్యాడని.. 70ఏళ్ల బామ్మ.. తల్లి అయ్యిందంటూ వార్తలు చూశాం. అయితే.. తాజాగా ఓ మహిళ చాలా వింత ఆరోపణలు చేసింది. తాను శృంగారంలో పాల్గొనకుండానే గర్భం దాల్చానని చెప్పడం గమనార్హం. గర్భం దాల్చాలంటే.. శృంగారం తప్పనసరి అన్న విషయం మనకు తెలుసు.
అయితే.. ఓ అమ్మాయి మాత్రం అందుకు భిన్నంగా గర్భం దాల్చిందట. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేసింది. మరి ఈ అమ్మాయి కథేంటో మనమూ ఓసారి చూసేద్దామా..
నా బాయ్ ఫ్రెండ్ తో ఎలాంటి శారీరక కలయిక లేకపోయినా.. నేను గర్భం దాల్చాను అంటూ.. ఓ యువతి సోషల్ మీడియాలో పేర్కొంది. అయితే.. ఆ అద్భుతం ఎలా జరిగిందో తనకు తెలియలేదని చెప్పింది.
ప్రస్తుతం ఆమె యువతి వయసు 26 సంవత్సరాలు కాగా.. 19ఏళ్ల వయసుకే తాను గర్భం దాల్చినట్లు ఆమె పేర్కొంది. కనీసం తాను ఒక్కసారి కూడా శృంగారంలో పాల్గొనలేదని ఆమె చెప్పింది.
ప్రస్తుతం సదరు యువతికి ఇద్దరు పిల్లలు. కాగా.. పెళ్లికి ముందు తాను ఎలా తల్లి అయ్యానో ఆమె వివరించింది.
ఒకరోజు రాత్రి.. సదరు యువతి ఆమె బాయ్ ఫ్రెండ్ తో గడిపిందట. వారిద్దరూ ఒకరినొకరు ముద్దు కూడా పెట్టుకున్నారు. అయితే.. సరిగ్గా వారం తర్వాత.. యువతికి భరించలేనంత కడుపులో నొప్పి వచ్చిందట. అంతేకాకుండా ఆమెకు ఆ నెల పీరియడ్స్ కూడారాలేదట.
వెంటనే తాను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాలని అనుకుందట. అయితే.. శృంగారంలో పాల్గొనకుండా గర్భం రాదని తన ప్రియుడు తనకు చెప్పినట్లు ఆమె పేర్కొంది.
అయితే.. నెల రోజుల తర్వాత యువతి నిజంగానే గర్భం దాల్చిందట. ఈ విషయం తెలిసి ఇద్దరూ షాకయ్యారు. ఇదెలా సాధ్యపడిందో.. వాళ్లకి అర్థం కాలేదు. దీంతో.. వెంటనే వారు డాక్టర్లను సంప్రదించారు.
వారు చేసిన పరిశోధనలో ఏం తేలింటే.. ఫోర్ ప్లే సమయంలో.. సదరు యువకుడి వీర్యం.. యువతి శరీరంలోకి ప్రవేశించిందట. తద్వారా యువతి గర్భం దాల్చినట్లు తేలింది.
అయితే.. ఇది చాలా రేర్ కేసుల్లో జరుగుతుందట. విచిత్రం ఏమిటంటే.. ఆమె గర్భం దాల్చినప్పటికీ.. వర్జిన్ గా ఉండటం. ఆ తర్వాత ఆమెకు బిడ్డకూడా పుట్టిందట. ఆతర్వాత ఆమె పెళ్లిచేసుకోగా.. మరో బిడ్డ జన్మించింది. కాగా.. ఈ విషయాన్ని యువతి ఇటీవల సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.