బెడ్రూంలోకి దూరిన ఎలుక.. భర్త పురుషాంగం కొరికేసిన భార్య

First Published | Sep 5, 2020, 11:09 AM IST

ఈ సంఘటన ఆఫ్రికాలోని జాంబియాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఓ ఎలుక భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టింది. అంతేనా.. ఆ భర్త ప్రాణాల మీదకు కూడా తెచ్చింది.
దాదాపు ఎలుకలు, బల్లులను చూస్తే.. మహిళలు కాస్త భయపడిపోతారు. అలాంటివి కనపడగానే.. వాటిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టమని భర్తలను వేడసుకుంటారు.

ఓ మహిళ కూడా అలానే చేసింది. ఎలుకను వెళ్లగొట్టమని భర్తని కోరింది. కానీ ఆ భర్త అందుకు అంగీకరించలేదు. కాసేపు భార్యను ఏడిపిద్దామని అనుకొని ఉంటాడు.. ఆ ఎలుకను వెళ్లగొట్టలేదు. దీంతో.. ఆమెకు మండిపోయింది. వెంటనే భర్త పురుషాంగాన్ని కొరికేసింది. ఇంకేముంది... తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరాడు.
ఈ సంఘటన ఆఫ్రికాలోని జాంబియాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జాంబియాకు చెందిన ముసోంటాక్(52) .. భార్య మకుపా(40)తో కలిసి జీవిస్తున్నాడు. కాగా.. ఇటీవల మకుపా ఫ్రెండ్స్ తో కలిసి పార్టీకి వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆమెకు బెడ్రూంలో ఓ ఎలుక తిరుగుతూ కనిపించింది.
దానిని చూసి భయపడిన ఆమె.. ఎలుకను ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలని భర్తని కోరింది. అయితే.. ఆమె కోరికను సదరు భర్త గారు పట్టించుకోలేదు. పైగా ఏమీ పట్టనట్లు పడుకొని నిద్రపోయాడు.
దీంతో.. ఆమెకు ఆగ్రహం విపరీతంగా పెరిగిపోయింది. ఆవేశంతో రెచ్చిపోయింది. భర్త మర్మాంగాన్ని... కొరికేసింది. అంతే... చుట్టుపక్కల నాలుగైదు ఇళ్లకు వినిపించేలా అరిచాడు. ఆ తర్వాత భార్యను తోసేసి... అక్కడి నుంచి పరుగో పరుగు. దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లి... ఎమర్జెన్సీ అని చెబితే... వాళ్లు ఆపరేషన్ చేశారు.
ఆపరేషన్ తర్వాత పోలీసులు... బాధితుణ్ని కలిసి... ఎలుకకే ఇంత పని ఎందుకైందని ప్రశ్నించారు. అప్పుడు చెప్పాడు అసలు విషయం. భార్యాభర్త ఇద్దరీ కొన్నాళ్లుగా పడట్లేదట. అందువల్ల ఇద్దరూ వేర్వేరు బెడ్‌రూంలలో పడుకుంటున్నారట. అతని బెడ్‌రూంలో ఎలుకలు లేవు. ఆమె బెడ్‌రూంలో ఉన్నాయి.
దీంతో.. వారి మధ్య గొడవ జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Latest Videos

click me!