టెక్సాస్ కు చెందిన ఓ భార్యాభర్తల ప్రేమ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కారణం ఏంటంటే.. ఆ భార్య తన భర్తకు పెట్టే లంచ్ లో ఓ ముద్ద ముందు తాను తిని ఆ తరువాత ప్యాక్ చేస్తుందట. దీని వెనుక ఓ రహస్యం కూడా ఉందట. ఈ విషయాన్ని ఇటీవల ఆమె ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తే అది వైరల్ గా మారింది.
మగాడి మనసుకు దారి కడుపులోనుండే ఉంటుందని మన పెద్దవాళ్లు చెబుతారు. కరెక్టుగా ఆ పాయింట్ పట్టుకున్నట్టుంది ట్రేసీ. అదే ఫాలో అవుతుంది. ఆహారం రుచి చేసే చేతుల్లో కంటే చూపించే ప్రేమలో ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు ఏ పదార్థమైనా సరే తినేముందు దాని ప్యాక్, రుచి, తయారీ కంటే ముందు మనకోసం ప్రేమగా పంపించరన్న భావన ఎంతో హాయిగా ఉంటుంది.
అందుకే తాను ఇలాంటి పని చేస్తున్నానని చెబుతోంది ట్రేసీ.. ఇంతకీ విషయం ఏంటంటేటెక్సాస్ లోని ట్రేసీ హోవెల్ కు భర్త క్లిఫర్డ్ హోవెల్ అంటే పంచ ప్రాణాలు. తనకు ఇష్టంగా వండిపెట్టడం అంటే ప్రాణం.
వీలైతే కలిసి భోజనం చేయాలని తపిస్తుంది. అందుకే లంచ్ రెడీ చేయడమే కాదు కొన్నిసార్లు లంచ్ బాక్స్ తో భర్త ఆఫీసుకు వెళ్లి తనతో పాటు కలిసి భోంచేస్తుంది. ఆ సమయంలో భర్త కళ్లలో కనిపించే ఆనందం వెలకట్టలేనిది అంటోందామె.
అలా ఓ రోజు అతనికి తయారు చేసిన శాండ్ విచ్ ను ఓ బైట్ కొరికి అలాగే ప్యాక్ చేసి పంపించింది. రాత్రికి ఇంటికి వచ్చిన భర్త తన శాండ్ విచ్ ఎవరో ఓ ముక్క కొరికారని చెప్పాడు. అప్పుడామె.. ఆ పని చేసింది నేనే నని చెబుతూ.. అలా చేయడం వల్ల మీతో పాటే నేనున్నాననే భావన కలిగిస్తున్నని చెప్పుకొచ్చింది. ఇది క్లిఫర్డ్ కు బాగా నచ్చింది.
లంచ్ టైంలో భార్యను మిస్సవ్వకుండా ఉండేందుకు ఇది సహాయపడింది. తింటున్నంతసేపు ఆమె తలంపులే అతన్ని ఊపేస్తాయట. దాంతో ప్రతీరోజూ అతనికి పంపే శాండ్ విచ్ ఓ ముక్క కొరికి పంపడం భర్త అది సంతోషంగా తినడం.. గత 41 సంవత్సరాలుగా ఇదే జరుగుతోంది. లేటెస్టుగా ఈ విషయాన్ని కొరికిన బర్గర్ ఫొటోతో సహా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. అది 100K షేర్స్, 28k లైక్స్ తో వైరల్ అయ్యింది.
ఆమె ఫేస్ బుక్ పేజ్ అంతా చక్కటి మెసేజ్ లతో నిండిపోయింది. తను పెట్టిన చిన్న పోస్ట్ ఇంతమందిని ఇంతలా కదిలించినందుకు సంతోషం అంటూ ఆమె మళ్లో పోస్ట్ పెట్టి కృతజ్ఞతలు తెలిపింది.