దాంపత్య జీవితం సజావుగా, ఆనందంగా సాగాలంటే దంపతులిద్దరి మధ్య చక్కని అనుబంధం ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకుని మసలుకోవాలి. అది ఒక్క శృంగారంలో మాత్రమే కాదు... ప్రతి విషయంలో ఒకరి ఆలోచనలను మరొకరు గౌరవించాలి. అప్పుడే వారి బంధం ఆనందంగా సాగుతుంది.
undefined
అలా కాకుండా.. ఒకరిపై మరొకరు పెత్తనం చెలాయించాలని చూస్తే.. మొదటికే మోసం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో... చాలా మంది భార్యభర్తలకు కౌన్సిలింగ్ కోసం నిపుణుల వద్దకు వస్తున్నారట.
undefined
వారిలో చాలా మంది శృంగారం విషయంలో కొందరు భార్యలదే తప్పు అని చెబుతుంటే.. మరికొందరు కాదు.. మా భార్తలే కారణమని చెబుతున్నారు.కామన్ గా ఎదురౌతున్న కొన్ని సమస్యలు.. వాటికి నిపుణులు ఇస్తున్న సలహాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
undefined
పెళ్లైన కొద్ది రోజుల వరకు ఇద్దరం ఆనందంగా ఉన్నాం. రోజుకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎంజాయ్ చేశాం. నేను పూర్తిగా నా భార్యకు బానిసగా మారిపోయాను అని తను పూర్తిగా నమ్మిన దగ్గర నుంచి కండిషన్స్ పెడుతోంది. తాను చెప్పినట్లు వింటేనే పడకగదిలోకి రాణిస్తానని కండిషన్స్ పెడుతోందని ఓ భర్త వాపోవడం గమనార్హం.
undefined
భార్య తన పనులు చేయించుకోవడం కోసం, తన మాట నెగ్గించుకోవడం కోసం సెక్స్‌ను అస్త్రంలా వాడుతుంటారు. ఇలాంటి బెదిరింపుల వల్ల భార్యభర్తల మధ్య దూరం అమాంతం పెరిగిపోతుంది. అంతేకాకుండా.. ఇలానే తరచూ జరిగితే భార్యపై భర్తకు ప్రేమ తగ్గిపోతాయి.. తర్వాతర్వాత కోరికలు కూడా కలగవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined
ఇదే ధోరణిలో భార్యలు ప్రవర్తిస్తే... భర్తలో అంగస్థంభన సమస్యలు మొదలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దాని వల్ల భార్య, భర్తలు ఇద్దరూ నష్టపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
undefined
ఏవైనా ఉంటే..ముందుగానే సామరస్యంగా పరిష్కరించుకోవాలని... ఇలా ప్రతిదానికీ బెడ్రూమ్ తో ముడిపెట్టకూడదని చెబుతున్నారు. చిన్నపిల్లాడికి చాక్లెట్ ఆశపెట్టినట్లుగా... వీటిని ముడిపెడితే.. భవిష్యత్తులో భర్తకు విరక్తి వచ్చి.. మరో స్త్రీ మోజులో పడే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు.
undefined
నా స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది.. దీంతో.. నేను నపుంసకుడినంటూ నా భార్య అందరికీ ప్రచారం చేస్తోందని మరో భర్త డాక్టర్ వద్ద బోరుమన్నాడు.
undefined
దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే... వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్నంత మాత్రాన నపుంసకులుగా భావించాల్సిన అసవరం లేదని చెప్పారు. నపుంసకత్వం అనేది లేదని.. ఉండదని బరోసా ఇస్తున్నారు. ప్రస్తుతం అత్యున్నతమైన వైద్యం అందుబాటులోకి వచ్చింది. స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి గల కారణాన్ని కనిపెట్టి.. దానికి తగిన చికిత్స చేస్తారని చెబుతున్నారు.
undefined
అంతేకాకుండా... ఇలాంటి విషయాల్లో భర్తకు భార్య సపోర్ట్ ఎంతో అవసరమని చెబుతున్నారు. భార్యలే ముందుగా అందరి ముందు భర్తను కించపరిచేలా మాట్లాడకూడదని... ఇలాంటి సమయంలో భార్య మద్దతుగా నిలిస్తే.. వారి బంధం మరింత బలంగా మారుతుందని చెబుతున్నారు.
undefined
నాకు శృంగారంపై ఆసక్తి ఎక్కువ. కానీ ఆ ఆసక్తిని నా భర్త మొరటుతనంతో పొగొడుతున్నాడు. వింత వింత సెక్స్ పొజిసెన్స్ లో శృంగారం చేయాలని పట్టుపడుతున్నాడు. కాదంటూ కసురుకోవడం.. తిట్టడం అవసరమైతే కొడుతున్నాడు అంటూ ఓ భార్యమణి తన ఆవేదన వ్యక్తం చేసింది.
undefined
ఈ రకం సమస్యను ఈ మధ్యకాలంలో చాలా మంది ఎదురుకుంటున్నారట. ఈ సమస్యతో తమ గడప తొక్కిన వాళ్లు చాలా మంది ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారంటే... మీకు ఇబ్బందికరంగా ఉన్న విషయాన్ని శృంగార సమయంలో కాకుండా... వేరే సమయంలో మీ భర్తకు వివరించే ప్రయత్నం చేయాలి.
undefined
మీకు ఎలా ఉంటే ఇష్టమో, ఎలాంటి చర్యలు ఆనందం కలిగిస్తాయో చెప్పండి. అలాగే మీకు నొప్పి కలగని సెక్స్ పొజిషన్స్ గురించి ఆయనకు తెలియజేయండి. అలా ఇద్దరు ఒకరికొకరు కంఫర్టబుల్‌గా తయారయ్యాక నెమ్మదిగా వేర్వేరు సెక్స్ పొజిషన్స్‌లో ప్రయోగాల గురించి ఓపెన్‌గా డిస్కస్ చేసుకోండి.
undefined
ఇలాంటి సెన్సిటివ్ విషయాలను ఓపెన్‌గా మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చు. ఒకవేళ అందులో ఇబ్బంది ఉంటే ఆలస్యం చేయకుండా సంబంధిత నిపుణులను సంప్రదించాలని చెబుతున్నారు.
undefined