భర్త కోసం కాల్ గర్ల్ గా మారిన భార్య..

First Published | Oct 5, 2020, 5:52 PM IST

నమ్మకం పునాదుల మీద ఏర్పడేదే భార్యభర్తల సంబంధం. వీరిలో ఎవరు, ఎవరి మీద అనుమాన పడినా ఆ బంధానికి విలువలేదు. భార్య మీద అనుమానంతో ఓ భర్త కాల్ గర్ల్స్ ను బుక్ చేస్తే.. భార్యే కాల్ గర్ల్ గా వచ్చిన వింత సంఘటన ఉత్తరాఖండ్ లోని కాశీపూర్ లో జరిగింది. 

నమ్మకం పునాదుల మీద ఏర్పడేదే భార్యభర్తల సంబంధం. వీరిలో ఎవరు, ఎవరి మీద అనుమాన పడినా ఆ బంధానికి విలువలేదు. భార్య మీద అనుమానంతో ఓ భర్త కాల్ గర్ల్స్ ను బుక్ చేస్తే.. భార్యే కాల్ గర్ల్ గా వచ్చిన వింత సంఘటన ఉత్తరాఖండ్ లోని కాశీపూర్ లో జరిగింది.
పోలీసుల దగ్గర పరస్పరం ఫిర్యాదుల దాకా వెళ్లిన ఈ ఘటనలో ఇద్దరూ నిర్దోషులే అని తెలిసి షాక్ అవ్వడం పోలీసులు వంతయ్యింది.

ఉత్తరాఖండ్ లోని కాశీపూర్ లో ఉండే ఓ వ్యక్తిని తన భార్య కదలికల మీద అనుమానం వచ్చింది. శృంగారంలో తనకు సరిగా సహకరించకుండా ఉండడం అనుమానాన్ని రెట్టింపు చేసింది. దీంతో ఓ బ్రోకర్ ని పిలిచి తనకు కాల్ గర్ల్ కావాలని బుక్ చేసుకున్నాడు.
దీనికోసం అతను ఓ హోటల్ లో రూం తీసుకున్నాడు. బ్రోకర్ ద్వారా బుక్ చేసిన కాల్ గర్ల్ వచ్చింది. తీరా చూస్తే ఆమె తన భార్య. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొట్టుకున్నారు కూడా.
అప్పటికే భర్తతో విడిపోయిన వేరేగా ఉంటున్న భార్య డబ్బుకోసం వ్యభిచారం చేస్తుందని ఆమె స్నేహితురాలు భర్తతో చెప్పింది. దీంతో విషయం తెలుసుకుందామని భార్య కాల్ గర్ల్ గా చేస్తున్న బ్రోకర్ తో కావాలని మాట్లాడి బుక్ చేసుకున్నాడు సదరు భర్త.
హోటల్ లో గొడవ జరగడంతో పోలీసులు వీరిద్దరినీ స్టేషన్ కు తరలించారు. అక్కడ భార్యా, భర్తలిద్దరూ ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. భార్య ఇలాంటి పనిచేస్తుందని తెలిసి కావాలని బుక్ చేసుకున్నానని భర్త అంటే.. భర్త వివాహేతర సంబంధాలు బట్టబయలు చేయడానికే కాల్ గర్ల్ గా వచ్చానని భార్య చెబుతోంది.
ఈ విచిత్రమైన కేసులో ఇద్దరూ దోషులు కాదని పోలీసులు వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు.

Latest Videos

click me!