భార్యాభర్తలు ఎప్పుడూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకుంటూ సంసారం సాగిస్తే అదే నిండు నూరేళ్లు సజావుగా సాగుతుంది. ఎప్పుడైతే నువ్వు ఎక్కువ నేను తక్కువ అనే మాటలు మొదలయ్యాయో సంసారంలో ఒడిదుడుకులు మొదలైనట్లే.
అందుకే బంధం 10 కాలాలపాటు పదిలంగా ఉండాలంటే భార్యాభర్తలిద్దరూ కలిసి ఈ పనులు చేయండి. కనీసం నెలకి ఒకసారైనా సెలవు పెట్టి పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత మీ ఇద్దరి కోసం మాత్రమే మీరు ఆ రోజు కేటాయించుకోండి. ఒకరికి నచ్చినట్లుగా ఒకరు.
ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఆరోజు ప్లాన్ చేసుకోండి. అలాగే కలిసి స్నానం చేయడం వలన కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వినడానికి అభ్యంతరంగా ఉన్నప్పటికీ ఇలా చేయటం వలన మానసిక ఒత్తిడి తగ్గి భార్యాభర్తలు ఇద్దరు మరింత..
దగ్గర అవ్వడానికి ఆస్కారం ఉంటుందని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే భార్య వంట చేసినప్పుడు భర్త కూడా సాయం చేయండి. ఇంతకుముందు కాలంలో భార్య ఇంటి వద్ద ఉండి ఇల్లు చక్కపెట్టుకునేది. కాబట్టి మగవాడికి అంతగా ఒత్తిడి ఉండేది కాదు.
ఆఫీస్ నుంచి వచ్చిన భర్తకి దగ్గర సేవలు చేస్తూ గడిపేది ఆ ఇల్లాలు. ఇప్పుడు అలా కాదు భార్యాభర్తలు ఇద్దరూ ఒత్తిడితో ఇంటికి వస్తున్నారు. ఒకరి కోసం ఒకరు పక్కన పెడితే వారికోసం కూడా వారు ఏమి చేసుకోలేని నిస్సార స్థితిలో ఉంటున్నారు. ఒత్తిడికి ఒకరి మీద ఒకరు కేకలు వేసుకుంటూ మనస్పర్ధలు పెంచుకుంటున్నారు.
నిజానికి ఒకరంటే ఒకరికి ఇష్టం లేకపోవడం వలన ఇలా జరగడం లేదు. కేవలం ఒత్తిడి వలన మాత్రమే ఇలా జరుగుతుంది కాబట్టి వీలైతే వారానికి ఒకసారి లేదంటే నెలకి ఒకసారి భార్యాభర్తలు ఇద్దరు ఏకాంతంగా గడపడానికి ప్రయత్నించండి. మీ బంధాన్ని కలకాలం నిలబెట్టుకోండి.